Mahavir phogat: వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి వెళ్లడం తప్పు.. పెద్దనాన్న మహవీర్ వ్యాఖ్య
- వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి వెళ్లడం తప్పు
- పెద్దనాన్న మహవీర్ ఫోగట్ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరింది. హస్తం పార్టీలో చేరిన కొద్ది సేపటికే ఆమెకు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కేటాయించింది. జులానా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే వినేష్ ఫోగట్ పొలిటికల్ ఎంట్రీపై ఆమె పెద్దనాన్న మహవీర్ ఫోగట్ తప్పుపట్టారు. ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు్న్నట్లు తెలిపారు. మరో ఒలింపిక్స్‌లో పాల్గొని బంగారు పతకం సాధించాలని ఆకాంక్షించారు. దానికోసం రెజ్లింగ్‌పై దృష్టి పెట్టాలని హితవు పలికారు. యువకులైన పిల్లలు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారని.. వారికి నచ్చజెప్పడమే తన బాధ్యత అని ఆయన చెప్పుకొచ్చారు.

Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ రెండు జాబితాలను విడుదల చేసింది. తొలి జాబితాలోనే వినేష్ ఫోగట్‌కు టికెట్ లభించింది. ఇక కాంగ్రెస్-ఆప్ పొత్తు ఉంటుందని అంతా భావించారు. కానీ పొత్తు లేకుండానే ఒంటరిగా బరిలోకి దిగుతున్నాయి. సోమవారం ఆప్ 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అలాగే సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. ఇక బీజేపీ కూడా తొలి జాబితాను విడుదల చేసింది. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Haryana: ఆటో డ్రైవర్‌పై ప్రశంసలు.. ఎంత మంచి పని చేశాడంటే..!
తాజావార్తలు
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
-
Mirzapur: The Movie: రిలీజ్‌కు ముందే కోట్లు కొల్లగొట్టిన కలీన్ భయ్యా.. మొదటి రోజే అదిరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్!
-
Hamas Crypto Funding: హమాస్‌కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్‌వర్క్‌పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!