లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ సిక్కులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ వైపు బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. ఇంకోవైపు ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మాత్రం మద్దతు తెలిపాడు.
దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాలకు మరోసారి బ్రేక్ పడింది. సోమ, మంగళవారాల్లో లాభాల్లో ముగిసిన సూచీలు.. బుధవారం మాత్రం అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు కారణంగా నష్టాలతో ప్రారంభమైంది.
ఐఐటీ గౌహతిలో ఓ విద్యాకుసుమం రాలిపోయింది. విద్యావ్యవస్థ నిర్లక్ష్యం కారణంగా ప్రతిభావంతుడైన విద్యార్థి ప్రాణాలు పోయాయి. దీంతో పరిపాలనా భవనం ఎదుట పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. విద్యార్థి మృతికి ఒత్తిడే కారణమని ఆరోపించారు. దీంతో నిరసనలకు తలొగ్గి ఐఐటీ-గౌహతి డీన్, ప్రొఫెసర్ కందూరు వి.కృష్ణ రాజీనామా చేశారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇరుక్కున్న బోట్లు వెలికితీసేందుకు అధికారులు, బేకం సంస్థ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా.. ఆటంకాలు ఎదురవుతున్నాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడ తెలిపారు. మంగళవారం ప్రకాశం బ్యారేజ్‌లో బోట్ల తొలగింపు పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలుగుదేశం బహిష్కృత నేత, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసు కొట్టేయాలని కోరారు. ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా, ఆరోపణల్లో నిజానిజాలు శోధించకుండా పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కాంగ్రెస్‌లో చేరాక కుటుంబం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోమవారం వినేష్ పెద్దనాన్న మహవీర్ ఫోగట్ స్పందిస్తూ.. వినేష్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తదుపరి ఒలింపిక్స్‌పై గురి పెట్టకుండా రాజకీయాల్లో రావడం చాలా పెద్ద తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఆమె బంధువు, బీజేపీ నేత బబిత ఫోగట్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై నిప్పుల చెరిగారు.
వచ్చే వారమే జమ్మూకాశ్మీర్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక్కడు మూడు విడతల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న ఓటింగ్ జరుగుతోంది. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
రెండు ప్రైవేటు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. ఆదేశాలను పాటించనందుకు యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంది. చట్టపరమైన, నియంత్రణ పరమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. ఒకరిపై ఒకరు ప్రతీకార దాడులు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ దాడికి పాల్పడింది. తొమ్మిది వేర్వేరు రష్యన్ ప్రాంతాలలో 144 డ్రోన్లను ప్రయోగించింది. మాస్కోలో 20 డ్రోన్లతో దాడి చేసింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ అభ్యర్థి యూటర్న్ తీసుకున్నాడు. తొలి జాబితాలో పెహావా నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా కన్వల్జీత్సింగ్ అజ్రానా పేరును కమలం పార్టీ ప్రకటించింది.