ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. నక్సలైట్లు ప్రజాకోర్టును నిర్వహించి ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు గ్రామస్తులకు మావోయిస్టులు మరణశిక్ష విధించారు. మూడో వ్యక్తిని విడుదల చేశారు. ఈ ఘటన బీజాపూర్‌లో చోటుచేసుకుంది.
మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినా జోక్సిమోవిక్‌ను భర్త థామస్‌నే చంపినట్లుగా న్యాయస్థానం తేల్చింది. ఆత్మ రక్షణ కోసమే ఈ హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. హత్య తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే ఆత్మ రక్షణ దేని కోసమో క్లారిటీ రాలేదు.
ఇండియాలో మరో 10 కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు వందే భారత్ రైళ్లను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈనెలలోనే మరో 10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సెప్టెంబర్ 15న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
దివంగత మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ పక్కనే నిలబడి రాజీనామా చేయాలంటూ సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జూనియర్ డాక్టర్ల చర్చలపై ప్రతిష్టంభన చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చలకు రావాలని డాక్టర్లకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయితే షరతులతో కూడిన ఆహ్వానం పంపించింది. దీంతో వైద్యులు చర్చలకు వచ్చేందుకు నిరాకరించారు.
ప్రముఖ రాజకీయ ఉద్దండుడు, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఏచూరికి మోడీ సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ రాజకీయ ఉద్దండుడు, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్‌లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్పై చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహ్నం 3:05 గంటలకు కన్నుమూసినట్లుగా ఎయిమ్స్ వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ వ్యవహారం తెలంగాణలో హీట్ పెంచింది.
అంతా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుని లేహ్‌కి ట్రెక్కింగ్ వెళ్లినా ప్రాణాలు నిలువలేదు. అర్ధాంతరంగా మైసూర్ ఇంజనీర్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.
వాహనదారులకు పెట్రోలియం శాఖ గుడ్‌న్యూస్ చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ కార్యదర్శి ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోవడం.. ఇంకోవైపు దేశంలో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు పెట్రోలియం శాఖ ఏర్పాట్లు చేస్తోంది.