బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సినిమా వ్యాపారాన్ని హైదరాబాద్ వైపు మళ్లించారు. ఇటీవల జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో సల్మాన్ ఖాన్‌తో పాటు అజయ్ కూడా పెట్టుబడులకు ఆసక్తి చూపారు. సల్మాన్ స్టూడియో వైపు వెళ్తుంటే, అజయ్ మాత్రం దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు తెరవాలని ప్లాన్ చేశారు. తన కొత్త బ్రాండ్ ‘దేవగన్ సినీ-ఎక్స్’ పేరుతో దాదాపు 250 స్క్రీన్‌లు ఏర్పాటు చేయాలనేది ఆయన లక్ష్యం. ఇప్పటికే గుర్‌గావ్‌లో ఒక థియేటర్ విజయవంతంగా నడుస్తోంది. ఇక తాజాగా ఇప్పుడు, హైదరాబాద్ పై ఆయన కన్నుపడింది..
Also Read : Patang : ఫ్రెండ్‌షిప్, లవ్ ఎంటర్‌టైనర్ ‘పతంగ్’ ట్రైలర్..!
కర్మన్‌ఘాట్ కొలీజియం మాల్‌లో ఏడు స్క్రీన్‌లతో కూడిన లగ్జరీ మల్టీప్లెక్స్‌ను వచ్చే ఏడాదే మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకు ముందు ఆయన పిల్లల పేర్లపై ‘ఎన్-వై సినిమాస్’ ఉన్నప్పటికీ, ఇప్పుడు తన పేరుతో బ్రాండ్‌ను మరింత బలోపేతం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో మహేష్ బాబు (ఏఎంబీ), అల్లు అర్జున్ (ఏఏఏ), రవితేజ (ఏఆర్‌టీ) వంటి తెలుగు స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్‌లో దూసుకుపోతున్నారు. ఈ పోటీ మధ్యలో అజయ్ దేవగన్ అడుగుపెట్టడం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. బాలీవుడ్ బ్రాండ్ ఇక్కడ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. అజయ్ దేవగన్ సినిమాల విషయానికి వస్తే, ‘దృశ్యం 3’, ‘ధమాల్ 4’, ‘రేంజర్’ వంటి చిత్రాలు 2026లో విడుదలై ఆయన కెరీర్‌కు మరింత బూస్ట్ ఇవ్వనున్నాయి.