TV Price Hike: కొత్త ఏడాదిలో టీవీల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మెమరీ చిప్‌ల కొరత, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ పతనంతో టీవీల తయారీపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దీంతో 2026 జనవరి నుంచి టీవీల ధరలు 3 నుంచి 10 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నాయి. ఇటీవల డాలర్ మారకంలో రూపాయి విలువ తొలిసారిగా 89.88కి చేరింది. అలాగే, టీవీల తయారీలో ఉపయోగించే ఓపెన్‌సెల్, సెమీ కండక్టర్ చిప్‌లు, మదర్‌బోర్డు లాంటివి విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.. ఏఐ సర్వర్లకు హై బ్యాండ్‌విడ్త్ మెమరీ (హెచ్‌బీఎం) చిప్‌ల డిమాండ్ భారీగా ఉండటంతో పాటు అన్ని రకాల మెమరీ చిప్‌ల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇక, చిప్ తయారీదారులు అధిక లాభాలు అందించే ఏఐ చిప్‌ల తయారీ వైపు మొగ్గు చూపిస్తుండటం వల్ల టీవీల లాంటి లెగసీ డివైస్ ల సరఫరా తగ్గిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఎల్‌ఈడీ టీవీల ధర 3 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు.
Read Also: BJP: ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు బీజేపీ ఇన్‌ఛార్జ్‌లు నియామకం.. తమిళనాడుకు ఎవరంటే..!
అయితే, కొన్ని టీవీ తయారీ కంపెనీలు ఇప్పటికే టీవీల ధర పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ఇప్పటికే డీలర్లకు సమాచారం ఇచ్చారు. గత మూడేళ్లలో మెమరీ చిప్‌ల ధర 500 మేరకు పెరిగిందని శామ్సన్, కోడక్ వంటి టీవీల తయారీ లైసెన్సు గల సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. రాబోయే రెండు త్రైమాసికాల్లోనూ కూడా చిప్‌ల ధర పెరుగుతూనే ఉండొచ్చని, అదే జరిగితే ధరలు భారీగా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఇక, సోర్సింగ్ స్థాయిలో ఫ్లాష్ మెమరీ, డీడీఆర్4 ధరలు 1000 శాతం మేరకు పెరిగాయని, వాటిని ఏఐ డేటా సెంటర్లకు సరఫరా చేయడమే దీనికి ప్రధాన కారణమని వీడియోటెక్స్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ తెలిపారు.
కాగా, వచ్చే ఏడాది రెండో త్రైమాసికం వరకు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చిప్‌ల తయారీ పరిస్థితి కొంత మెరుగుపడే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రూపాయి విలువలో క్షీణించడంతో పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసిందని, దీని వల్ల దిగుమతి వ్యయాలు భారీగా పెరిగిపోయాయని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో మార్కెట్లో పాత ఇన్వెంటరీ పూర్తైన తర్వాత నుంచి వీటి ప్రభావం క్రమంగా వినియోగదారుపై కనిపిస్తుందని బజాజ్ వెల్లడించింది.