ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. నక్సలైట్లు ప్రజాకోర్టును నిర్వహించి ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు గ్రామస్తులకు మావోయిస్టులు మరణశిక్ష విధించారు. మూడో వ్యక్తిని విడుదల చేశారు. ఈ ఘటన బీజాపూర్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Miss Switzerland: మాజీ మిస్ స్విట్జర్లాండ్ క్రిస్టినా హత్య కేసులో భర్తను దోషిగా తేల్చిన కోర్టు
రెండు రోజుల క్రితం భైరామ్‌ఘర్ ప్రాంతంలోని జప్పెమార్క ప్రాంతంలో నక్సలైట్లు ఒక విద్యార్థితో సహా ముగ్గురు గ్రామస్తులకు ప్రజా కోర్టును ఏర్పాటు చేశారు. జప్‌మీర్క గ్రామస్తులు మాద్వి సౌజా మరియు పొడియం కోసాలు పోలీసు ఇన్‌ఫార్మర్లు అని ఆరోపించారు. దీంతో వారికి ప్రజా కోర్టులో మరణశిక్ష విధించారు. మిర్తూరు హాస్టల్‌లో చదువుతున్న పోడియం హిద్మ అనే విద్యార్థిని ప్రజాకోర్టు నుంచి విడుదల చేశారు. ఇద్దరు గ్రామస్తుల హత్యకు నక్సలైట్ల భైరామ్‌ఘర్ ఏరియా కమిటీ బాధ్యత వహించింది.
ఇది కూడా చదవండి: Vande Bharat: మరో 10 వందే భారత్ రైళ్లు లాంచ్.. 15న ప్రారంభించనున్న మోడీ