ఇండియాలో మరో 10 కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు వందే భారత్ రైళ్లను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈనెలలోనే మరో 10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సెప్టెంబర్ 15న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: CS Neerabh Kumar Prasad: ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం
రాబోయే రైళ్లు టాటానగర్-పాట్నా, వారణాసి-దియోఘర్, రాంచీ-గొడ్డ, దుర్గ్-విశాఖపట్నం, టాటానగర్-బెర్హంపూర్ (ఒడిశా), రూర్కెలా-హౌరా, హౌరా-గయా, ఆగ్రా-వారణాసితో సహా కీలక మార్గాల్లో కనెక్టివిటీని మరింత విస్తరింపజేయనున్నాయి. రైల్వే వ్యవస్థను ఆధునీకరించే భాగంగా ఈ కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నారు. ఈ రైళ్లు హై-స్పీడ్ సామర్థ్యాలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా అధునాతన సౌకర్యాలు ఏర్పటు చేశారు. ప్రతి సీటు దగ్గర మొబైల్ ఛార్జింగ్ ఇచ్చారు. ఇటీవలే ప్రధాని మోడీ మూడు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. మీరట్ నుంచి లక్నో, మధురై నుంచి బెంగళూరు, చెన్నై నుంచి నాగర్‌కోయిల్‌లను కలుపుతూ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ ఈ రైళ్లు ప్రారంభమయ్యాయి.
ఇది కూడా చదవండి: Ajit Doval: రష్యా ముందుకు ఉక్రెయిన్ శాంతి ప్రణాళిక.. పుతిన్‌తో అజిత్ దోవల్ భేటీ..