ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జూనియర్ డాక్టర్ల సమావేశం ముగిసింది. కాళీఘాట్ నివాసంలో ఆమెతో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. పోలీస్ ఎస్కార్ట్ వాహనంతో 30 మంది వైద్యులు సాయంత్రం 6:20 గంటలకు ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు.
రష్యాలో జనాభా తగ్గుదలపై దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. పని విరామ సమయంలో రష్యన్లు సెక్స్ చేయాలని కోరారు.
ప్రధాని మోడీ మంగళవారం 74వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీకి వచ్చిన బహుమతులను సెప్టెంబర్ 17న వేలం వేయనున్నాయి. ఈ మేరకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు.
ప్రధాని మోడీ మంగళవారం 74వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. సెప్టెంబర్ 17న మోడీ పుట్టిన రోజు వేడుకలు ప్రత్యేకంగా జరిపేందుకు దేశ వ్యాప్తంగా పలు సంస్థలు, బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్గా అజ్మీర్ షరీఫ్‌లో 4000 కిలోల శాఖాహారం లంగర్ కూడా ఏర్పాటు చేశారు.
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం-ఒకే ఎన్నికలు అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ జమిలి ఎన్నికలకు సన్నాహాలు చేస్తు్న్నట్లు వార్తలు వెలువడుతున్న తరుణంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కర్ణాటకలో నలుగురు మైనర్లు పాలస్తీనా జెండాలతో హల్చల్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. లిక్కర్ కేసులో తీహార్ జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విడుదలైన తర్వాత హస్తిన రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాను కేజ్రీవాల్ కలిసి రాజీనామా సమర్పించనున్నారు.
మొత్తానికి బెంగాల్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు జూనియర్ వైద్యులు అంగీకరించారు. సోమవారం ఇదే చివరి ఆహ్వానం అంటూ బెంగాల్ ప్రభుత్వం వైద్యులను ఆహ్వానించింది. ప్రత్యక్ష ప్రచారంపై గత కొద్దిరోజులుగా సమావేశంపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన చోటుచేసుకుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరంటూ సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే ప్రముఖంగా ఆమ్ ఆద్మీ పార్టీలో కీ రోల్ పోషించిన పేర్లు వినిస్తున్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇందుకోసం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే.సక్సేనా అపాయింట్మెంట్ ఇచ్చారు. వీకే.సక్సేనాను కేజ్రీవాల్ కలిసి తన పదవికి రాజీనామా చేయనున్నారు. లిక్కర్ పాలసీ కేసులో ఇటీవలే కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.