దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మంగళవారం సాయంత్రం హఠాత్తుగా మెరుపులు, గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా హస్తిన వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రధాని మోడీ మంగళవారం 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. మోడీ పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా పండుగలా నిర్వహించారు. అన్నదానాలు, రోగులకు పండ్లు పంపిణీ చేయడం వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
అతిచిన్న వయసులోనే అమెరికా నర్తకి తనువు చాలించింది. అర్ధాంతరంగా ప్రాణాలు విడిచింది. ఆ ఘటన ఆమె అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. అయితే సూసైడ్ వెనుక ఉన్న మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు.
ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌కు నైతిక విలువలు ఉండుంటే.. అరెస్ట్ అయినప్పుడే రాజీనామా చేసేవారని వ్యాఖ్యానించారు. రాజ్‌నాథ్ సింగ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు సమర్పించారు. అతిషితో కలిసి కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం కేజ్రీవాల్ రిజైన్ లెటర్.. వీకే.సక్సేనాకు అందజేశారు.
జమ్మూకాశ్మీర్‌లో బుధవారం తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్‌లో మొత్తం 24 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక సిబ్బంది కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. అయితే ఈ విచారణను న్యాయస్థానం ప్రత్యక్ష ప్రచారం చేస్తోంది. ఈ కేసు విచారణను లైవ్ టెలికాస్ట్ చేయొద్దంటూ బెంగాల్ ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ తాజా గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 83 వేల మార్కు దాటింది. నిఫ్టీ కూడా 25, 400కు పైగా మార్కు క్రాస్ చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని బుధవారం ప్రకటించనుంది.
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న బుల్డోజర్ చర్యలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1వ తేదీ వరకు కోర్టు అనుమతి లేకుండా దేశంలో ఎక్కడా ఆస్తులను కూల్చరాదని ధర్మాసనం ఆదేశించింది.
ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఖర్గే కోరారు. క్రమశిక్షణ లేని నాయకులను నియంత్రించాలని కోరుతున్నానని.. భారతీయ రాజకీయాలు పతనం కాకుండా ఉండాలంటే తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.