అఖండ నుండి అఖండ 2 వరకు బ్యాక్ టు బ్యాక్ 5 సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టాడు నందమూరి బాలకృష్ణ. ఇలా వరుసగా హిట్స్ కొడుతూ సీనియర్ హీరోలలో టాప్ ప్లేస్ లో దూసుకెళ్తున్నారు బాలయ్య. అదే జోష్ లో మరొక సినిమా స్టార్ట్ చేసాడు. గతంలో వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని బాలయ్యతో మరో సినిమా చేస్తున్నాడు. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా రాబోయే ఈ సినిమా రెగ్యులర్ మాస్ సినిమా కాకుండా పాన్ ఇండియా లెవెల్లో హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మించనున్నారు.
Also Read : Ranveer Singh : దీపికా 8 గంటల వర్క్ షిఫ్ట్ పై రణవీర్ సింగ్ హాట్ కామెంట్స్
బాలయ్య సరసన లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి బాలయ్య లుక్ పై వర్క్ చేస్తున్నాడు గోపీచంద్ మలినేని.బాలయ్య ఆస్థాన విద్వాంసుడు నందమూరి తమన్ మరోసారి బాలయ్య సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇటీవల దర్శకుడు గోపీచంద్ మలినేనితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేసాడు. ఈ సారి నందమూరి అభిమానులకు సర్ప్రైజ్ ప్లాన్ చేసాడు తమన్. NBK 111లో బాలయ్యతో ఓ సాంగ్ పాడించబోతున్నాడు. బాహుబలి సినిమాలో దలేర్ మెహందీ పాడిన ‘సాహోరే బాహుబలి’ పాట లాంటి ఒక పాటను ఈ చిత్రంలో బాలకృష్ణ పాడనున్నారు.ఈ విషయాన్నీ స్వయంగా తమన్ ప్రకటించాడు. హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమాలో బాలయ్య యోధుడిగా కనిపించబోతున్నారు.