Mysuru: లెహ్‌కు ట్రెక్కింగ్‌కి వెళ్లి శ్వాస అందక మైసూర్ ఇంజనీర్ మృతి
- విషాదంగా మారిన లెహ్ ట్రెక్కింగ్ యాత్ర
- శ్వాస అందక మైసూర్ ఇంజనీర్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుని లేహ్‌కి ట్రెక్కింగ్ వెళ్లినా ప్రాణాలు నిలువలేదు. అర్ధాంతరంగా మైసూర్ ఇంజనీర్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.
నరేన్ కౌశిక్ (44) అనే ఇంజనీర్ ఏడుగురు స్నేహితులు, ఇద్దరు వైద్యులు, ఇద్దరు షెర్పాలతో కలిసి సెప్టెంబర్ 2న హర్యానా నుంచి లేహ్ వరకు ట్రెక్కింగ్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఎత్తైన చోటుకు వెళ్లాక నరేన్ కౌశిక్‌కి శ్వాస సమస్యలు తలెత్తాయి. 18,000 అడుగుల ఎత్తులో ఉన్న అతనికి వైద్య సదుపాయాలు అందించారు. శతవిధాలా అతన్ని బ్రతికించేందుకు ప్రయత్నించినా సఫలీకృతం కాలేదు. దీంతో నరేన్ కౌశిక్ ప్రాణాలు వదిలాడు. సెప్టెంబర్ 7న లేహ్ సమీపంలో కౌశిక్ మరణించాడు.
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
ఇది కూడా చదవండి: Germany: జర్మనీలో అశోక చక్రవర్తి అవశేషాలు.. పరిశీలించిన భారత విదేశాంగ మంత్రి
సెప్టెంబరు 8 సాయంత్రం కౌశిక్ మరణవార్తను కుటుంబసభ్యులకు తెలియజేశారు. అవసరమైన లాంఛనాలు, శవపరీక్ష పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 9 సాయంత్రం అతని మృతదేహాన్ని ఫ్యామిలీకి అప్పగించారు. ఆఖరి కర్మలు నిర్వహించేందుకు సమయం మించిపోయిన కారణంగా కుటుంబ సభ్యులు లేహ్‌లో సెప్టెంబరు 10 ఉదయం అంత్యక్రియలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఆయన భౌతికకాయాన్ని లేహ్ దగ్గర సింధు నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాలు అన్ని జరిగేందుకు మైసూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి హెచ్‌సి సహా స్థానిక అధికారులు మహదేవప్ప, ముఖ్యమంత్రి మీడియా సలహాదారు కె.వి. ప్రభాకర్.. లేహ్ డిసి సంతోష్ సుఖదేవ్‌తో సమన్వయం చేసుకుని పనులు జరిగించారు. ఐజిపి సిఆర్‌పిఎఫ్ విపుల్ కుమార్, మైసూరు సిటీ పోలీస్ కమిషనర్ సీమా లట్కర్, ఇతర అధికారులు అంత్యక్రియలకు అదనపు సహాయాన్ని అందించారు.
ఇది కూడా చదవండి: KCR: సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత సంతాపం..
నరేన్ కౌశిక్ బెంగళూరులోని జీఈ ఎలక్ట్రికల్స్-మెడికల్ ఎక్విప్‌మెంట్‌లో డిప్యూటీ మేనేజర్‌గా ఉన్నారు. SJCE మైసూరు నుంచి BE పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మూడవ ర్యాంక్ హోల్డర్. గతంలో టయోటా, ఫిలిప్స్, అంతర్జాతీయంగా US, మిడిల్ ఈస్ట్, UK, జర్మనీలలో పనిచేశాడు. కౌశిక్ విపరీతమైన ప్రకృతి ప్రేమికుడు. ఇప్పటికే అనేక ట్రెక్కింగ్ యాత్రలు చేపట్టాడు. అంతేకాకుండా నైపుణ్యం కలిగిన ఫ్లూటిస్ట్ కూడా.
కౌశిక్‌కు భార్య రాధిక, కుమార్తె వరుణి, తల్లిదండ్రులు ప్రొఫెసర్ ఆర్.ఎన్. పద్మనాభ, నాగరత్న పద్మనాభ, సోదరుడు పవన్ కౌశిక్ ఉన్నారు. ప్రస్తుతం వీరంతా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో నివసిస్తున్నారు. సెప్టెంబర్ 18, 19 తేదీల్లో మైసూరులోని సరస్వతీపురంలోని వైష్ణవ సభలో ఆయన 12వ, 13వ రోజుల క్రతువులు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: Matka: చివరి రౌండ్ లో వరుణ్ తేజ్ ‘మట్కా’
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!