Labanon: ఓ వైపు ఐరాసలో నెతన్యాహు ప్రసంగం.. ఇంకోవైపు లెబనాన్‌పై దాడులు
- ఓ వైపు ఐరాసలో నెతన్యాహు ప్రసంగం
- ఇంకోవైపు లెబనాన్‌పై దాడులు
- దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్ స్థావరాలే లక్ష్యంగా దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిజ్బుల్లా అంతమే తమ లక్ష్యమంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఐకరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రతిజ్ఞ చేసిన కొన్ని నిమిషాలకే ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌పై భీకరదాడులకు దిగింది. హిజ్బుల్లా సంస్థకు చెందిన స్థావరాలు టార్గెట్‌గా దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. లెబనాన్ రాజధాని బీరూట్‌కు దక్షిణాన వైమానిక దాడులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. బీరుట్‌కు దక్షిణాన జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో భారీగా పొగ మేఘాలు కమ్ముకున్నాయి.
ఇది కూడా చదవండి: Dussehra Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దసరా సెలవుల ప్రకటన
Also Read
ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ.. దక్షిణ శివార్లలోని హిజ్బుల్లా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలిపారు. న్యూయార్క్‌లోని యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్రతినిధులను ఉద్దేశించి నెతన్యాహు ప్రసంగాన్ని ముగించిన కొద్ది క్షణాల తర్వాత బాంబు దాడి జరిగింది. ఆ సమయంలో హిజ్బుల్లాకు వ్యతిరేకంగా దాడులను కొనసాగిస్తామని, హమాస్‌పై విజయం సాధించేవరకు పోరాడతానని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు.
అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా దండెత్తింది. ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకుపోయారు. ఆ ఘటనతో ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. ఆ నాటి నుంచి ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. హమాస్ లక్ష్యంగా గాజాను ధ్వంసం చేసింది. హమాస్‌కు వత్తాసు పలికిన లెబనాన్‌పై కూడా దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా ఐరాస వేదికగా నెతన్యాహు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 90 శాతం మంది హమాస్ రాకెట్లను నాశనం చేసినట్లు చెప్పుకొచ్చారు. వారి సగం బలగాలను అంతం చేయడమో, బంధించడమో చేశామని.. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామని చెప్పారు. మా లక్ష్యాలను చేరేవరకు హెజ్బుల్లాపై పోరాటం కొనసాగిస్తామని శపథం చేశారు. ఏడాది కాలంగా ఈ పరిస్థితులను సహిస్తూనే వస్తున్నామని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu Naidu: తిరుమల లడ్డూ వివాదంపై మరోసారి చంద్రబాబు ఫైర్
ఈసారి ఐరాస సమావేశాలకు రావాలనే ఉద్దేశం లేనప్పటికీ.. తమపై కొన్ని దేశాధినేతలు చేసిన అవాస్తవాలను ఖండించడానికే ఇక్కడికి వచ్చినట్లు నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్ శాంతిని కోరుకుంటుదన్నారు. ఒకవేళ ఇరాన్ దాడి చేస్తే ప్రతిదాడి తప్పదని పరోక్షంగా హెచ్చరించారు. చాలా కాలంగా యావత్ ప్రపంచం ఇరాన్‌ను బుజ్జగిస్తూ వస్తోందని.. దానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే ఇటీవల నెతన్యాహు మాట్లాడుతూ.. హిజ్బుల్లాపై పూర్తి స్థాయిలో దాడులు చేయాలని ఆదేశించారు. ఇక ఇజ్రాయెల్ ముందుగా హెచ్చరించినట్లుగానే మరో అడుగు ముందుకేసింది. లెబనాన్‌లోని హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా భూతల దాడులు చేసేందుకు సరిహద్దు ప్రాంతంలో వేల సంఖ్యలో యుద్ధ ట్యాంకర్లను మోహరించింది. దీంతో ఏ క్షణమైనా గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టే అవకాశాలున్నాయని మీడియా కథనాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Tirumala Laddu Issue: రేపు సిట్ బృందం తిరుపతికి రాక
తాజావార్తలు
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!