ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీన ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి ఏఐఎక్స్ కనెక్ట్ కింద నమోదైన విమానాలన్నీ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పేరుతో నడవనున్నాయి. విలీనం అనంతరం కార్యకలాపాలను పరిశీలిస్తామని డీజీసీఏ తెలిపింది.
ఆ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నారు. రోజూ ప్రేమ కలాపాల్లో మునిగి తేలుతున్నారు. షికార్లు చేస్తున్నారు. హాయిగా ప్రేమ ఊహాల్లో విహరిస్తున్నారు. అయితే ఏకాంతంగా గడపాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే ఒక హోటల్ గది బుక్ చేసుకున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అనంతరం నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి.
బ్యాంకాక్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 25 మంది విద్యార్థులు సజీవదహనం అయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.
భారత్ నుంచి పారిపోయి మలేసియాలో ఉంటున్న వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు దయాది దేశం పాకిస్థాన్ సోమవారం రెడ్‌కార్పెట్ స్వాగతం పలికింది. పాక్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్‌లో వరుస ఉపన్యాసాలు ఇచ్చేందుకు ఆయన ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దూకుడు కొనసాగిస్తూనే ఉంది. కొద్ది రోజులుగా హిజ్బుల్లా లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. అగ్ర నేతలందరినీ ఒక్కొక్కరినీ అంతమొందిస్తోంది. ఇప్పటికే హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా ముఖ్య నాయకులంతా హతమయ్యారు.
ఫీజు విషయంలో ఐఐటీ సీటును కోల్పోయిన దళిత విద్యార్థికి సుప్రీంకోర్టు ఊరట లభించింది. 18 ఏళ్ల అతుల్ కుమార్ తన చివరి ప్రయత్నంలో ప్రతిష్టాత్మకమైన జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఐఐటీ ధన్బాద్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో సీటు లభించింది. అయితే జూన్ 24వ తేదీ వరకు గడువులోగా రూ.17,500 ఫీజు చెల్లించలేకపోయాడు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. బెంగళూరులో నిర్మలా సీతారామన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కొద్ది రోజులకే ఉపశమనం లభించింది. పోల్ బాండ్ల కేసులో నిర్మలా సీతారామన్‌పై విచారణకు కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. నిర్మలా సీతారామన్, ఇతర బీజేపీ అగ్ర నేతలపై తదుపరి విచారణను కర్ణాటక హైకోర్టు సోమవారం నిలిపివేసింది.
జీవిత బీమా ప్రీమియంలకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఎఐ ప్రతిపాదించిన సవరించిన సరెండర్ విలువ మంగళవారం నుంచి అమల్లోకి వచ్చినందున బీమా ప్రీమియంలు పెరగవచ్చు లేదా ఏజెంట్ల కమీషన్ తగ్గవచ్చు.