టెలికాంలో ఎన్ని ప్రైవేటు సంస్థలు వచ్చినా బీఎస్‌ఎన్‌ఎల్ ప్రతిభ ఎప్పుడూ మసకబారలేదు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ సంస్థ ఎప్పటికప్పుడూ దూకుడుగా వెళ్తూనే ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్ తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించేందుకు పరుగులు పెడుతోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్‌లను పరిచయం చేస్తోంది. తాజాగా తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. 60 రోజుల వ్యాలిడిటీతో బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
ఇది కూడా చదవండి: Strange Tradition: ఇదెక్కడి ఆచారం.. ఈ తెగలో తండ్రి కూతురిని పెళ్లి చేసుకుంటాడట?
ప్లాన్ వివరాలు ఇవే..
రూ.345 ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. రోజుకు 1జీబీ డేటా, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు ఉంటాయి. అపరిమిత కాలింగ్ కూడా పొందవచ్చు. అయితే ఇందులో బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్, హర్డీ గేమ్స్ తరహా సదుపాయాలు మాత్రం అందుబాటులో ఉండవు. ఇటీవల ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ టారిఫ్‌లను పెంచేశాయి. బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం అలాంటి చర్యలకు పాల్పడలేదు. ఫలితంగా చాలామంది యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్లపై మొగ్గుచూపుతున్నారు. తాజా ప్లాన్‌లతో మరింత కస్టమర్లు పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Sajjala Ramakrishna Reddy: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సజ్జల కౌంటర్