ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు బంకర్ బస్టర్ గురించే చర్చ జరుగుతోంది. అత్యంత రహ్యస ప్రాంతంలో దాగి ఉన్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను బంకర్ బస్టర్ అంతమొందించింది. భూగర్భంలో దాదాపు 60 అడుగుల లోతులో అండర్‌గ్రౌండ్‌లో భద్రతా బలగాల కాపుదలలో ఉన్న నస్రల్లాను లేపేసింది. ఇప్పుడే ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఇజ్రాయెల్ ఎలా చంపగలిగింది?, నస్రల్లాను ఎలా కనిపెట్టగలిగింది?, బంకర్ బస్టర్‌ను ఎలా ఉపయోగించగలిగింది? ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్న ఇదే చర్చ జరుగుతోంది. అసలు బంకర్ బస్టర్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తోంది?, దాని శక్తి సామర్థ్యాలు తెలియాలంటే ఈ వార్త చదవండి.
గత కొద్ది రోజులుగా హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. మొదట పేజర్లతో ఆట మొదలు పెట్టింది. మరుసటి రోజే వాకీటాకీలను పేల్చేసింది. అనంతరం దాదాపు 600 రాకెట్లను ప్రయోగించింది. ఇలా దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా ఒకెత్తు అయితే.. హిజ్బుల్లాకు కేంద్ర బిందువైన హసన్ నస్రల్లాపై గురిపెట్టింది. అయితే నస్రల్లాను అంతమొందించడం అంత ఈజీ కాదు. అసలు ఎక్కడ ఉంటాడో తెలియదు. అత్యంత రహస్యమైన చోట ఉంటాడు. మూడో కంటికి కూడా అతడి జాడ తెలియదు. అలాంటిది ఇజ్రాయెల్ అతడి జాడ కనిపెట్టింది. భూగర్భంలో 60 అడుగుల దూరంలో ఉన్నట్లు కనిపెట్టింది. పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంది. నస్రల్లాను చంపాలంటే ఒకే ఒక మార్గం బంకర్ బస్టర్ అని భావించింది. అంతే ఇజ్రాయెల్ ఈ అస్త్రానికి పని పెట్టింది. బంకర్ బస్టర్‌ను ప్రయోగించి నస్రల్లాను చంపేశారు. అంతే అసలు నస్రల్లాను ఎలా చంపగలిగారు. ఇది అసాధ్యం? ఎలా సాధ్యమైందని ప్రపంచమంతటా చర్చ మొదలైంది.
బంకర్ బస్టర్ కాంక్రీటుతో సహా ఎంతటి గట్టి పదార్ధాలునైనా 30 మీటర్ల వరకు చొచ్చుకుపోయి లక్ష్యాన్ని చేధిస్తోంది. 900 కిలోల బరువు ఉంటుంది. ఇందులో 2 వేల బాంబులు ఉంటాయి. నస్రల్లా ఉన్న చోటు కనిపెట్టగానే ఈ బంకర్ బస్టర్లను ఇజ్రాయెల్ ప్రయోగించింది. అప్పటికే హిజ్బుల్లా ముఖ్యనేతలతో నస్రల్లా రహస్యంగా సమావేశం అయి ఉండడంతో బంకర్ బస్టర్ల దెబ్బకు నస్రల్లా నేలకొరిగాడు. నస్రల్లాతో పాటు ముఖ్య నేతలు కూడా చనిపోయారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రకటన చేసింది. అనంతరం హిజ్బుల్లా కూడా ధృవీకరించింది.
బంకర్ బస్టర్‌ను యూఎస్ తయారు చేసింది. దీన్ని జర్మన్ ఇంజనీర్ ఆగస్ట్ కోయెండర్స్ రూపొందించాడు. 1942-1943లో పరీక్షించబడింది. మొట్టమొదటి అధునాతన బంకర్-బస్టింగ్ ఫిరంగిల్లో ఇది ఒకటిగా నిలిచింది. యూఎస్ ఎయిర్ ఫోర్స్ మార్చి 12, 2003 దీన్ని ప్రయోగించినప్పుడు విజయవంతంగా లక్ష్యాన్ని చేధించింది. దీంతో అమెరికా దగ్గర నుంచి ఇజ్రాయెల్ కొనుగోలు చేసింది. ఇందులో మందుగుండు సామగ్రి ఉంటుంది. కాంక్రీట్ సహా ఎంతటి గట్టి పదార్ధాలనైనా చేధిస్తోంది. భూమికి 30 మీటర్ల వరకు వెళ్లి చొచ్చుకుపోతుంది. లక్ష్యా్న్ని చేరుకున్నాకే అందులో ఉన్న బాంబులు పేలిపోతాయి. ఇది రెండో ప్రపంచ యుద్ధం నాటిది. అయితే నస్రల్లాను చంపేందుకు 80 టన్నుల పేలుడు పదార్థాలను ఉపయోగించింది. ఇక నస్రల్లా ఉన్న బంకర్‌లోకి 85 ప్రత్యేక బంకర్ బస్టర్లను ఇజ్రయెల్‌ను ప్రయోగించింది. దీంతో హిజ్బుల్లా అగ్ర నేత నేలకొరిగాడు. వాస్తవానికి బంకర్ బస్టర్ అంతర్జాతీయంగా నిషేధం ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం బీరుట్ దాడుల్లో ప్రయోగించి తీవ్ర చర్చనీయాంశంగా చేసింది.