సెబీ చీఫ్ మాధబిపై అమెరికా సంస్థ హిండెన్‌బర్ చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి. అనంతరం విపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున సెబీపై విమర్శలు చేశారు. తాజాగా ఇదే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. సెబీపై వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రజలకు ఆర్థిక మంత్రి సూచించారు.
హర్యానా ఎన్నికల ఫలితాల తీర్పును విశ్లేషిస్తున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. హర్యానా ఎన్నికల్లో హస్తం పార్టీకి అనూహ్య దెబ్బ ఎదురైంది. ఎగ్జిట్ పోల్స్ చూసి మంచి జోష్‌లో కనిపించింది. కౌంటింగ్ ప్రారంభంలో కూడా ఊహించిన ఫలితాలే వచ్చాయి.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ సవరణకు పూనుకుంది. ఇందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దేశ రాజ్యాంగాన్ని సమీక్షించడానికి, సరిచేయడానికి, సంస్కరణలను సిఫార్సు చేయడానికి తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది.
అదానీ గ్రూప్‌కు శ్రీలంక కొత్త ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్ చేపట్టబోయే ప్రాజెక్టులపై పున:సమీక్ష జరుపుతామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అదానీ గ్రూప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలేటట్టు కనిపిస్తోంది. గత ప్రభుత్వం ఆమోదించిన అదానీ గ్రూప్ పవన విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షిస్తామని శ్రీలంక కొత్త ప్రభుత్వం తెలిపింది.
హర్యానా ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారని ప్రధాని మోడీ అన్నారు. హర్యానాలో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు హాజరయ్యారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అనూహ్య విజయం సాధించింది. ఎట్టకేలకు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు ఖాతా తెరిచింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మేహరాజ్ మాలిక్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,770 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా ఫలితాలను తాము అంగీకరించడం లేదని తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. హర్యానా ఫలితాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. హర్యానా ఫలితాలపై చాలా ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు.
హర్యానాలో మొత్తానికి బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. అంచాలన్నీ తల్లకిందులు చేస్తూ కమలం పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఛేజిక్కించుకుంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ దాటింది. 48 స్థానాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు చేస్తూ బీజేపీ సూపర్ విక్టరీని అందుకుంది.
హర్యానాలో ఈసారి హస్తం పార్టీదే అధికారమని.. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని సర్వేలన్నీ ఊదరగొట్టాయి. రెండు రోజులు గడిచే సరికి అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఎగ్జిట్ పోల్స్‌లో ఏ ఒక్కటి నిజం కాలేదు. తిరిగి హర్యానా ప్రజలు కమలం పార్టీనే కోరుకున్నారు. హస్తం పార్టీని తిరిగి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు.
జమ్మూకాశ్మీర్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయి. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని.. హంగ్ ఏర్పడడం ఖాయమని దాదాపు అన్ని సర్వేలు తేల్చాయి. కానీ ఈవీఎంల ఫలితాలు వచ్చేటప్పటికీ అంచాలన్నీ తలకిందులయ్యాయి.