నవీ ముంబై అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో విమాన ట్రయల్ ల్యాండింగ్ విజయవంతంగా ముగిసింది. IAF C-295 విమానం నవీ ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్ అయింది. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ల్యాండింగ్ ట్రయల్‌ను ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు పలువురు ఎంపీలు వీక్షించారు.
చిన్న పిల్లల కార్టూన్ ఛానల్లో డోరేమాన్ ప్రోగ్రామ్ గురించి తెలియని వాళ్లు ఉండరు. ఈ ప్రోగ్రామ్ చిన్న పిల్లలదే అయినా.. వారితో పాటు పెద్దవాళ్లు కూడా చూసి ఆనందిస్తుంటారు. ముఖ్యంగా ఇందులో నోబితా-డోరేమాన్ కాంబినేషన్ విచిత్రంగా ఉంటుంది.
చాలా మంది అప్పుడప్పుడు కష్టాలొచ్చినప్పుడు ఏదైనా లాటరీ తగిలితే బాగుండును బాధలన్నీ తీరిపోతాయని అనుకుంటారు. ఇబ్బందులు వచ్చినప్పుడు ఇలా అనుకోవడం సహజమే. కానీ అదే నిజమైంది ఓ కుటుంబానికి. లక్ష కాదు.. రెండు లక్షల కాదు.. ఏకంగా రూ.25 కోట్ల లాటరీ తగిలింది. దీంతో ఆ కుటుంబం సంతోషంతో మునిగిపోయింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఇరాన్-రష్యా అధ్యక్షుల సమావేశం ఆసక్తి రేపుతోంది. హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ శుక్రవారం భేటీ అయ్యారు. ఇరువురు నేతలు తుర్క్మెనిస్థాన్ రాజధాని ఆష్గాబత్లో సమావేశం అయ్యారు.
మను భాకర్ పరిచయం అక్కర్లేని పేరు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత భారతీయులకు మను భాకర్ సుపరిచితురాలే. స్టార్ షూటర్‌గా ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించింది. దీంతో ఆమె పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? మను భాకర్ షూటర్‌గానే కాకుండా ఫ్యాషన్ షోలో కూడా తన వయ్యారాలతో అలరించింది. క్యూట్ వాక్‌తో చూపరులను ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఒడిదుడుకులు ఎదురయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఒక్కొక్క రోజు ఒక్కోలా మార్కెట్ నడుస్తోంది. గురువారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. శుక్రవారం మాత్రం ఫ్లాట్‌గా ప్రారంభమై నష్టాల్లోకి జారుకుంది.
ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో.. అక్కడ దైవత్వం వికసిస్తుందని అంటారు. అలాంటిది ఓ కంపెనీ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా వివాహిత దుస్తులపై కామెంట్స్ చేయడమే కాకుండా.. యాసిడ్ పోస్తానని బెదిరించాడు. ఈ వ్యవహారం కంపెనీ దృష్టికి వెళ్లడంతో ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఢిల్లీలోని రమేష్ నగర్లో పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. గురువారం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో 200 కిలోల కొకైన్‌ను పట్టుబడింది. దీని విలువ రూ. 2 వేల కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ప్రధాని మోడీ లావోస్ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన కోసం గురువారం మోడీ లావోస్ వెళ్లారు. 21వ శతాబ్దం భారతదేశం, ఆసియాన్ దేశాల శతాబ్దంగా ప్రధాని మోడీ అభివర్ణించారు. లావోస్ వేదికగా 21వ ‘ఆసియాన్- ఇండియా సమ్మిట్’లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు.