దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల కారణంగా మార్కెట్ వరుస నష్టాలను చవిచూసింది. మంగళవారం ఉదయం కూడా ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం లాభాల్లోకి దూసుకొచ్చింది.
కోల్‌కతా వైద్యురాలి అత్యాచార ఘటన మరోసారి ఉధృతం అవుతోంది. ఆగస్టు 9న ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇక ఆమెకు మద్దతుగా జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళనలు చేపడుతున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తమిళనాడులో ఘోర విమాన ప్రమాదం తప్పింది. చెన్నై ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్ అవుతుండగా టైర్ పేలిపోయింది. దీంతో ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది హడలెత్తిపోయారు. మస్కట్ నుంచి 146 మంది ప్రయాణికులతో చెన్నై చేరుకుంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు 61 శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే పోలింగ్ ముగియగానే సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఆ సంస్థలు చేసిన సర్వేలు విడుదల చేశాయి. దాదాపు అన్ని సర్వేలు హర్యానాలో కాంగ్రెస్‌కే మొగ్గుచూపించాయి.
ప్రధాని మోడీ శనివారం మహారాష్ట్రలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇక ముంబైలో మెట్రో లైన్-3ను ప్రారంభించారు. అనంతరం బీకేసీ నుంచి శాంతాక్రజ్ స్టేషన్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు
అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం షాకిచ్చింది. శబరిమల దర్శనంపై పినరయ విజయన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ భక్తులకు మాత్రమే దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులంతా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ఇకపై పేజర్లు, వాకీటాకీలపై నిషేధం విధించినట్లు ఆ సంస్థ తెలిపింది. దుబాయ్‌లో ప్రయాణికుల దగ్గర దొరకడంతో పోలీసులు వాటిని జప్తు చేశారు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్ అవతారమెత్తారు. భార్యతో కలిసి జొమాటో డ్రస్‌లో ఇద్దరూ ఫుడ్ డెలివరీ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఇదే మాదిరిగా చేసిన గోయల్.. ఈసారి భాగస్వామిని వెంటవేసుకుని ఫుడ్ డెలివరీ చేసి ఆశ్చర్యపరిచారు.
హర్యానాలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూతులకు భారీగా తరలివచ్చారు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం ఓటింగ్ నమోదు కాగా.. సాయంత్రం 6 గంటలకు ముగిసే సమయానికి భారీగానే పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు భావిస్తున్నారు.
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం మోడీ 3.0 ప్రభుత్వంలో జేడీయూ కీలక పాత్ర పోషిస్తోంది. పైగా త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలంటూ పాట్నా నగరమంతా జేడీయూ శ్రేణులు పోస్టర్లు అంటించారు. భారతరత్నకు నితీష్ కుమార్ అర్హులని పోస్టర్లలో పేర్కొన్నారు.