హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి హస్తం పార్టీ నేతలు నిరాశ, నిస్పృహలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జిమ్మిక్కులు చేసి హర్యానాలో గెలిచిందని కాంగ్రెస్ ఆరోపించింది.
దేశంలో ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తోంది. వినాయక చవితి ముగిసింది. ప్రస్తుతం దసరా నవరాత్రులు నడుస్తున్నాయి. అనంతరం దీపావళి పండుగ రానుంది. ఇలాంటి పెద్ద ఫెస్టివల్స్ సమయంలో కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ఇవ్వడం పెద్ద గగనమే.
నోబెల్ బహుమతుల ప్రకటనలు కొనసాగుతున్నాయి. బుధవారం రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. ఇక గురువారం సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్ బహుమతి వరించింది. చారిత్రక విషాదాలను ఆమె తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టారని స్వీడిష్ అకాడమీ పేర్కొంది.
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధినేతలు హాజరయ్యారు. అంతకముందు అంతిమయాత్రకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివచ్చారు.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్చన కొచ్చర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫ్యాషన్ షో వేదికపై అర్చన కొచ్చర్ వాక్ చేస్తుండగా సడన్‌గా డ్రస్ చెప్పుల్లో ఇరుక్కుని తుళ్లిపడబోయింది. వెంటనే తేరుకుని చెప్పులు విసిరేసి వాక్ కొనసాగించింది.
రతన్ టాటా అస్తమయం తర్వాత.. ఆయన ఇష్టపడే శునకం దీనంగా ఎదురుచూస్తోంది. దీంతో పోలీసులు దానిని టాటా భౌతికకాయం దగ్గరకు తీసుకెళ్లి చూపించారు. దీంతో దీనంగా కూర్చుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్‌తో జత కలిసి ఎన్నికల బరిలోకి దిగింది.
దేశీయ స్టాక్ మార్కె్ట్ ఒక్కరోజు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి. దీంతో గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ముగింపు దాకా గ్రీన్‌లోనే కొనసాగాయి.
ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం లావోస్‌లోని వియంటియాన్ చేరుకున్నారు. ప్రధాని మోడీకి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనడానికి ప్రధాని మోడీ గురువారం లావోస్‌కు చేరుకున్నారు.
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలు వద్దంటూ పినరయి విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఒకే దేశం-ఒకే ఎన్నికలపై కేంద్రం ముందడుగు వేసింది.