హర్యానా ఎన్నికల ఫలితాల తీర్పును విశ్లేషిస్తున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. హర్యానా ఎన్నికల్లో హస్తం పార్టీకి అనూహ్య దెబ్బ ఎదురైంది. ఎగ్జిట్ పోల్స్ చూసి మంచి జోష్‌లో కనిపించింది. కౌంటింగ్ ప్రారంభంలో కూడా ఊహించిన ఫలితాలే వచ్చాయి. కానీ అంతలోనే సీన్ రివర్స్ అయింది. ఉన్నట్టుండి ఫలితాలు బీజేపీ వైపు టర్న్ అయ్యాయి. చివరికి కమలం పార్టీనే అధికారం ఛేజిక్కించుకుంది. ముచ్చటగా మూడోసారి హర్యానాలో హ్యాట్రిక్ కొట్టి సరికొత్త రికార్డ్ నమోదు చేసింది.
ఇది కూడా చదవండి: NTR Neel: ట్రెండ్ కి భిన్నంగా ఎన్టీఆర్ – నీల్ సినిమా?
తాజాగా హర్యానా ఫలితాలపై ఖర్గే స్పందించారు. హర్యానా ఎన్నికల ఫలితాలు ఊహించని విధంగా ఉన్నాయి.. ప్రజల తీర్పును పార్టీ విశ్లేషిస్తోందని చెప్పారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం సుదీర్ఘమైనది.. కాబట్టి.. కార్యకర్తలు నిరాశ చెందకూడదన్నారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలు, హక్కుల ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థల దుర్వినియోగానికి చెంపపెట్టుగా జమ్మూకశ్మీర్‌లో తీర్పు వెలువడిందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌వాసుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించడానికి కట్టుబడి ఉందని ఖర్గే చెప్పారు.
ఇది కూడా చదవండి: Sri Lanka: అదానీ సంస్థకు షాక్.. విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షిస్తామన్న కొత్త ప్రభుత్వం
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, కాంగ్రెస్ 37 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. 13 సార్లు హర్యానాలో ఎన్నికలు జరిగితే.. ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే అలవాటు ఉంది. కానీ ఈసారి మాత్రం బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని ప్రజలు అందించారు.
On Congress party's performance in Haryana and J&K assembly elections, party President Mallikarjun Kharge tweets, "Heartfelt gratitude to the people of Jammu and Kashmir for allowing the Congress Party and the National Conference alliance to serve… The result of Haryana is… pic.twitter.com/yJ2C3IIiyn
— ANI (@ANI) October 8, 2024