Haryana Elections: హర్యానా సీఎంగా మళ్లీ నయాబే! అధిష్టానం ఆయన వైపే మొగ్గు!
- హర్యానాలో హ్యాట్రిక్ కొట్టిన కమలం పార్టీ
- సీఎంగా మళ్లీ నయాబ్ సైనీ!
- అధిష్టానం ఆయన వైపే మొగ్గు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో మొత్తానికి బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. అంచాలన్నీ తల్లకిందులు చేస్తూ కమలం పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఛేజిక్కించుకుంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ దాటింది. 48 స్థానాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు చేస్తూ బీజేపీ సూపర్ విక్టరీని అందుకుంది.
తాజాగా హర్యానా ముఖ్యమంత్రి ఎవరంటూ జోరుగా చర్చ సాగుతోంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు మనోహర్‌లాల్ ఖట్టర్‌ను సీఎం పీఠం నుంచి తప్పించి నాయబ్ సింగ్ సైనీ వర్గానికి చెందిన ఓట్లు రాబట్టేందుకు ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ కూర్చోబోట్టింది. అనుకున్నట్టుగానే బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. దీంతో తిరిగి నాయబ్ సింగ్ సైనీనే ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మెజార్టీ అగ్ర నేతలంతా ఆయన వైపే ఉన్నట్లు సమాచారం అందుతోంది.
Also Read
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
- Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
- UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
ఇదిలా ఉంటే మంగళవారం కౌంటింగ్ మొదలైన కొద్దిసేపటి వరకు కాంగ్రెస్ ముందంజలో దూసుకెళ్లింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఊహించని మలుపుతిరిగింది. అనుహ్యంగా బీజేపీ పుంజుకుంది. దీంతో కాంగ్రెస్ ఖంగుతింది. మ్యాజిక్ ఫిగర్ దాటుకుని బీజేపీ హర్యానాలో తిరిగి హ్యాట్రిక్ అధికారాన్ని నిలబెట్టుకుంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, కాంగ్రెస్ 37 స్థానాలు సొంతం చేసుకున్నాయి.
ప్రధాని మోడీ.. నాయబ్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ అగ్ర నేతలంతా ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతున్నారు. నయాబ్.. మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు అత్యంత సన్నిహితుడు. ఓబీసీ వర్గానికి చెందిన సైనీ 1996లో బీజేపీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పార్టీలో పలు పదవులు నిర్వహించారు. 2014లో నారాయణ్‌గఢ్ నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతేడాది అక్టోబరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అనంతరం సీఎంగా పదోన్నతి పొందారు. తాజాగా ఆయన ఆధ్వర్యంలో మరోసారి అధికారాన్ని దక్కించుకున్నారు.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!