ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో సభ్యదేశాల అతిథుల కోసం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న (బుధవారం) జరగనున్నాయి. ఈ మేరకు మంగళవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఒకే విడతలో ఓటింగ్ జరగనుంది. అయితే వారం మధ్యలో (బుధవారం) పోలింగ్ ఎందుకు పెట్టారని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సీఈసీ రాజీవ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.
రతన్ టాటా భారతదేశ ముద్దు బిడ్డ అని నీతా అంబానీ కొనియాడారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక దీపావళి విందులో నీతా అంబానీ, ముఖేష్ అంబానీ, వారి కుటుంబ సభ్యులు, రిలయన్స్ నాయకత్వం, వేలాది మంది ఉద్యోగులు రతన్ టాటాకు నివాళులర్పించా
బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. బెంగళూరులోని మాన్యతా టెక్ పార్క్, ఆర్జీఏ టెక్ పార్క్ ఎదురుగా ఉన్న జంక్షన్ భారీ వర్షం కారణంగా జలమయమైంది. నీళ్లు నిలిచిపోవడంతో సాప్ట్వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లోని 47 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలతో పాటు వాయనాడ్‌కు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. జార్ఖండ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా నవంబర్ 13న జరగనుంది.
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. అప్రమత్తమైన సిబ్బంది ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారి ఒకరు తెలిపారు.
ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు మెటా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే నెలలో భారీగా ఖాతాలపై నిషేధం విధించింది. ఆగస్టు నెలలో 84.58 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించినట్లు వాట్సప్ సంస్థ పేర్కొంది.
బెంగళూరులో రూ. 97 కోట్ల కుంభకోణానికి పాల్పడిన యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ మరియు ముగ్గురు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా ఎనిమిది మందిని బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీళ్లంతా స్టాక్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.
భారత స్టార్ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆటకు కొంత సమయం విరామం ప్రకటించింది. ఈ సమయంలో ఆయా ఈవెంట్స్‌ల్లో పాల్గొంటోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన లాక్మే ఫ్యాషన్‌లో పాల్గొని ర్యాంప్‌పై వయ్యారాలు ఒలకబోసింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. హర్యానా ఫలితాలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కూడా ఫిర్యాదు చేసింది.