దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత మూడు రోజులుగా సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. శుక్రవారం కూడా ప్రారంభంలో నష్టాలతో మొదలైనా.. అనంతరం క్రమక్రమంగా సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 218 పాయింట్లు లాభపడి 81, 224 దగ్గర ముగియగా.. నిఫ్టీ 104 పాయింట్లు లాభపడి 24, 854 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 84.07 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Viral Video: ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవ.. వారి మధ్యలో నలిగిపోయిన అబ్బాయి ఏం చేశాడంటే..?
నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్‌గా కొనసాగగా.. ఇన్ఫోసిస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, హెచ్‌యుఎల్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. సెక్టార్లలో బ్యాంక్ మరియు మెటల్ ఒక్కొక్కటి 1 శాతానికి పైగా పెరిగాయి. ఐటీ ఇండెక్స్ 1 శాతానికి పైగా.. ఎఫ్‌ఎంసిజి ఇండెక్స్ 0.5 శాతం తగ్గాయి. బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ సూచీలు రెడ్‌లో ముగియగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా లాభాల్లో ముగిశాయి.
ఇది కూడా చదవండి: YS Jagan: నెల రోజుల్లో ఇసుకను దోచేశారు.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు