ఇకపై ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి తీరాల్సిందేనని అమెజాన్ హెచ్చరించింది. ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని వారు ఇతర కంపెనీల్లో పని చూసుకోవాలని అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సీఈఓ మాట్ గార్మాన్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఉద్యోగులు ఐదు రోజులు ఆఫీస్‌కు వచ్చి పని చేయాలని సూచించింది. ఈ కొత్త పాలసీకి కట్టుబడి ఉండేందుకు జనవరి 2 వరకు గడువు విధించింది. ఒకవేళ ఈ వాతావరణంలో పని చేయకపోతే వెళ్లిపోవచ్చని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: DGP Dwaraka Tirumala Rao: అక్టోబర్ 21 నుండి 31 వరకు సంస్మరణ దినోత్సవాలు
కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ నడిచింది. కోవిడ్ క్రమక్రమంగా అంతరించిన తర్వాత కొన్ని కంపెనీలు కార్యాలయాలకు వచ్చి పని చేయాలని ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చాయి. ఇప్పటికే కొందరు ఎంప్లాయిస్ ఆఫీసులకు వచ్చి పని చేస్తున్నారు. ఇంకొందరు ఇంటి నుంచే పని చేస్తు్న్నారు. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలకాలని అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సీఈఓ మాట్ గార్మాన్ అన్నారు. వారానికి ఐదు రోజులు కార్యాలయానికే వచ్చి పనిచేయాలనే నిర్ణయాన్ని ఆయన బహిరంగా వెల్లడించారు. ఇది ఇష్టం లేనివారు ఉద్యోగం వదిలేయొచ్చన్నారు.
ఇది కూడా చదవండి: Chicken: వైన్ షాపుల ముందు చికెన్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
ఇక అమెజాన్ ఆదేశాలను 10 మంది ఉద్యోగుల్లో 9 మంది ఈ విధానాన్ని స్వాగతించారు. ఆఫీసు వాతావరణంలో పనిచేయడానికి ఇష్టపడనివారు, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకొనేవారికి ఇతర కంపెనీలు ఉన్నాయంటూ గర్మాన్ హెచ్చరించారు. నూతన విధానాల అమలుకు కృషి చేస్తున్నామని.. రిమోట్ వర్క్ కారణంగా కొత్త ఆవిష్కరణలు తీసుకురావడంలో సహకారం కష్టంగా మారుతోందన్నారు. మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేస్తే కంపెనీ లక్ష్యాలను చేరుకోవడం చాలా కష్టమని ఆయన తెలిపారు. ప్రస్తుతం అమెజాన్ వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలనే విధానాన్ని అమలు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఈ కొత్త విధానం అమలులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: India-Canada Issue: ఖలిస్తానీ తీవ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు..కెనడా ఇంటెలిజెన్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..