హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు చేస్తు్న్న ఇజ్రాయెల్ గురువారం మరో చరిత్ర సృష్టించింది. అగ్ర నాయకులందరినీ ఐడీఎఫ్ దళాలు అంతమొందించాయి. అయితే గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి సూత్రదారి యాహ్యా సిన్వార్ మాత్రం చేతికి చిక్కలేదు. అతగాడి కోసం ఐడీఎఫ్ దళాలు ఎంత వెతికినా దొరకలేదు. అనూహ్యంగా ఇజ్రాయెల్ సైన్యంలో కొత్తగా చేరిన యువ దళాలు మాత్రం సిన్వార్‌ను చాకచక్యంగా అంతమొందించాయి. తొలుత సరిగ్గా గుర్తించలేకపోయారు. కానీ డీఎన్ఏ టెస్టులు తేలడంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిర్ధారించి ప్రకటన చేశారు. చనిపోయింది యాహ్యా సిన్వారేనని వెల్లడించారు. దీంతో ఇజ్రాయెల్ హిస్టరీలో మరో రికార్డు సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే యాహ్యా సిన్వార్ హతంపై అగ్ర రాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. హమాస్ చీఫ్‌ను చంపడంలో తమ దళాల ప్రత్యక్ష పాత్ర లేదని యూఎస్ ప్రకటన చేసింది. హమాస్ నాయకులను ట్రాక్ చేయడం, బందీలను గుర్తించడంలో అమెరికా సహాయపడిందని స్పష్టం చేసింది. ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన సమాచారం పంచుకున్నామే తప్ప.. సిన్వార్ హతం విషయంలో తమ పాత్ర లేదని పెంటగాన్ ప్రతినిధి మేజర్ జనరల్ పాట్రిక్ రైడర్ చెప్పారు.
ఇది కూడా చదవండి: Benjamin Netanyahu: “ఆడు మగాడ్రా బుజ్జి”.. హమాస్, హిజ్బుల్లాకు చుక్కలు చూపిస్తున్న నెతన్యాహూ..
2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసి.. బందీలుగా తీసుకుపోవడానికి యాహ్యా సిన్వారే కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుంచి అతడి కోసం ఐడీఎఫ్ దళాలు జల్లెడపడుతూనే ఉన్నాయి. కానీ వివిధ వేషాలు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నాడు. కానీ అనూహ్యంగా గురువారం ఇజ్రాయెల్ యువ సైన్యం చేతిలో సిన్వార్ హతమయ్యాడు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ బందీలు ఎక్కడున్నారన్నది ప్రశ్నగా మారిపోయింది. బందీలను సొరంగాల్లో బంధించి ఉంటారని ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Samsung Galaxy A16 5G: శాంసంగ్ నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్.. అదిరిపోయిన ఫీచర్లు