ఢిల్లీలో ప్రధాని మోడీని బాలీవుడ్‌కు చెందిన కపూర్ కుటుంబ సభ్యులు కలిశారు. ముంబై నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. బాలీవుడ్ స్టార్లు రణబీర్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, నీతూ కపూర్, కరిష్మా కపూర్లతో సహా కపూర్ కుటుంబ సభ్యులంతా ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన వారిలో ఉన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు మూడు జాతీయ పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. దీంతో ప్రధాన పార్టీలు సన్నద్ధం అయిపోతున్నాయి. అంతేకాకుండా ఇప్పటినుంచే మాటల-తూటాలు పేల్చుకుంటున్నాయి.
సిరియాపై ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ వైమానిక దాడులు నిర్వహించింది. సిరియా అంతటా క్షిపణులు ప్రయోగించింది. దీంతో బాంబు దాడులతో సిరియా దద్దరిల్లింది. తాజాగా సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది.
బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా(79) బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు. దీంతో ఆయన ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గత అక్టోబర్‌లో ఆయన ఇంటి దగ్గర పడిపోయారు.
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో ప్రభుత్వ క్వార్టర్ కేటాయిస్తామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రస్తుతం అన్ని రకాల బంగ్లాలు నిండిపోయి ఉన్నాయని చెప్పారు.
రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖర్పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రాజ్యసభ ఛైర్మన్.. ప్రతిపక్షం పట్ల పక్షపాతం చూపిస్తున్నారని ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.
కర్ణాటకలోని బెలగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన(యూబీటీ) నేత, ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధాని మోడీని కోరారు. బెలగావిలో మరాఠా మాట్లాడే ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.
జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
బ్యాంక్‌లు అనేవి కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలి. అవకాశం ఉంటే రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలి. సహజంగా బ్యాంకులు-కస్టమర్ల మధ్య ఇలాంటి సంబంధాలే ఉంటాయి. అయితే ఓ బ్యాంక్ మేనేజర్.. లోన్ ఆశ జూపి ఓ కస్టమర్ దగ్గర నాటుకోళ్లను నొక్కేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.
ఒక దేశం, ఒకే ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.