మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోరంగా ఓటమి పాలైంది. కూటమిలో పార్టీకి ఆశించ దగ్గ సీట్లు రాలేదు. ఓ వైపు ఈవీఎంలపై నెపం నెడుతున్నా.. ఇంకోవైపు పార్టీలో విభేదాలు మాత్రం కొట్టిచ్చినట్లు కనబడుతున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా కొనసాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. తాజాగా గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో ఆస్పత్రిలో ఉన్న 29 మంది మరణించారు.
ఇండియా కూటమి చీలిక దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమికి మల్లిఖార్జున ఖర్గేను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయన సారథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లారు. ఎన్డీఏ మెజార్టీ తగ్గించగలిగారు గానీ.. విజయం సాధించలేకపోయారు.
దాంపత్యం అనేది నాలుగు గోడల మధ్య రహస్యంగా జరిగేది. ఆలుమగల బంధం అత్యంత గోప్యంగా ఉంటుంది. మూడో కంటికి తెలియకుండా జరిగించేదే సంసారం. అలాంటిది ఓ జంట.. సభ్యత మరిచి పబ్లిక్‌గా లైంగిక చర్యలో పాల్గొన్నారు. దీన్ని రహస్యంగా సిబ్బంది చిత్రీకరించి.. మరింత అల్లరి పాలుజేశారు.
పోప్ ఫ్రాన్సిస్ భారత్ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ తెలిపారు. శనివారం వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ చేత కార్డినల్‌గా ఆర్చ్‌బిషప్ జార్జ్ జాకబ్ కూవకాడ్‌కు పట్టాభిషేకం జరగనుంది.
ఓట్లు, సీట్లు కారణంగానే తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని ప్రధాని మోడీ విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలోని అష్టలక్ష్మి మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. మూడోసారి ముచ్చటగా సీఎంగా ప్రమాణం చేశారు. ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు.
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పించే గురువునే చంపాడు ఓ విద్యార్థి. ఛతర్‌పుర్ జిల్లాలోని ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్కే సక్సేనా (55) ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం రోజే.. కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన చెల్లెలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.