Syria-Israel: సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. రెబల్స్ లక్ష్యంగా క్షిపణుల ప్రయోగం
- సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
- రెబల్స్ లక్ష్యంగా క్షిపణుల ప్రయోగం
- దాడులను ఖండించిన ఈజిప్ట్, సౌదీ అరేబియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిరియాపై ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ వైమానిక దాడులు నిర్వహించింది. సిరియా అంతటా క్షిపణులు ప్రయోగించింది. దీంతో బాంబు దాడులతో సిరియా దద్దరిల్లింది. తాజాగా సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సిరియా అధ్యక్షుడు అసద్.. రష్యాకు పారిపోయారు. దీంతో రెబల్స్.. రాజధాని డమాస్కస్‌తో సహా సిరియా అంతటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ఆయుధ సంపత్తి.. రెబల్స్ చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా సాయంతో సిరియాపై ఐడీఎఫ్ దళాలు డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించింది.
రసాయన ఆయుధాలు కలిగిన పరిశోధనా కేంద్రంతో సహా మిలిటరీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని భారీగా వైమానిక దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అసద్ పాలనను కూలదోసిన తర్వాత ఆయుధాలు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించేందుకు ఈ దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. డమాస్కస్‌కు 25 కిలోమీటర్ల పరిధి వరకు వైమానిక దాడులకు పాల్పడినట్లు యూకేకు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ వెల్లడించింది. ఈ ఘటనలో క్షిపణి లాంచర్లు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దళాలు సిరియా వైపు దూసుకువస్తున్నట్లు స్పష్టం చేసింది.
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ఇదిలా ఉంటే సిరియాపై ఇజ్రాయెల్ చేస్తు్న్న దాడులను ఈజిప్ట్, సౌదీ అరేబియా, తదితర దేశాలు ఖండించాయి. సిరియాలో నెలకొన్న అనిశ్చితిని ఆసరాగా చేసుకుని అక్కడి భూభాగాలను ఆక్రమిస్తూ ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాయి. అయితే ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకే దాడులు చేస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఇదిలా ఉంటే 1974లో సిరియాతో కాల్పుల విరమణ ఒప్పందంతో ఏర్పాటైన గోలన్ హైట్స్‌లో బఫర్ జోన్‌ను సైతం ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది.
ఇక సిరియాలో దాడులకు అమెరికా సమర్థించింది. సిరియాలో అధికార మార్పు కారణంగా పొరుగుదేశాలైన జోర్డాన్, లెబనాన్, ఇరాక్, ఇజ్రాయెల్‌కు ముప్పు పొంచి ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అందుకోసమే ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Anu Emmanuel: అను ఇమ్మాన్యుయేల్ ఎక్కడ..?
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?