దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పీజీ విద్యార్థులు మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదమా? హత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తు్న్నారు.
రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. సభలో ప్రతిపక్షంపై చిన్న చూపు చూస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
నోయిడాలోని జెవార్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో తొలి విమాన టెస్టింగ్ విజయవంతంగా ముగిసింది. సోమవారం అధికారులు నిర్వహించిన ఫ్లైట్ టెస్ట్ సక్సెస్‌గా ముగిసింది.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఢిల్లీ ప్రభుత్వం కాలం 2025, ఫిబ్రవరితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో జనవరిలోనే శాసనసభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
సిరియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరకాసేపట్లో సిరియా రాజధాని డమాస్కస్‌ను రెబల్స్ స్వాధీనం చేసుకోనున్నారు. అతి సమీపంలో తిరుగుబాటుదారులు ఉన్నారు. ఇప్పటికే పలు నగరాలు స్వాధీనం చేసుకున్నారు. రాజధాని డమాస్కస్ స్వాధీనం చేసుకుంటే సిరియా దేశం రెబల్స్ హస్తగతం అయినట్లే.
సిరియా తిరుగుబాటుదారుల హస్తగతం కాబోతుంది. ఇప్పటికే పలు నగరాలు స్వాధీనం చేసుకున్న రెబల్స్.. మరికొన్ని నిమిషాల్లోనే రాజధాని డమాస్కస్‌ను కూడా స్వాధీనం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు పదవీ గండం తప్పింది. పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానంపై ఓటింగ్‌ను పీపుల్ పవర్ పార్టీ బహిష్కరించింది. దీంతో ఆయనకు పదవీ గండం తప్పింది.