Chhattisgarh: బ్యాంక్ మేనేజర్ కక్కుర్తి.. లోన్ ఇప్పిస్తానని రూ.39 వేల చికెన్ ఫుడ్ ఆరగించిన ఘనుడు
- బ్యాంక్ మేనేజర్ కక్కుర్తి
- లోన్ ఇప్పిస్తానని రూ.39 వేల చికెన్ ఫుడ్ ఆరగించిన ఘనుడు
- మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులకు రైతు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంక్‌లు అనేవి కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలి. అవకాశం ఉంటే రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలి. సహజంగా బ్యాంకులు-కస్టమర్ల మధ్య ఇలాంటి సంబంధాలే ఉంటాయి. అయితే ఓ బ్యాంక్ మేనేజర్.. లోన్ ఆశ జూపి ఓ కస్టమర్ దగ్గర నాటుకోళ్లను నొక్కేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Rajendra Prasad: వాడెవడో చందనం దొంగ.. వాడు హీరోనా?..పుష్ప 2పై రాజేంద్ర ప్రసాద్ సంచలనం
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
రూపచంద్ మన్హర్ అనే రైతు తన పొలంలో కోళ్లను పెంచుతున్నాడు. తన వ్యాపారిని మరింత వృద్ధి చేసుకునేందుకు మస్తూరిలోని ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్‌ను కలిసి రూ.12 లక్షల రుణాన్ని కోరాడు. అందుకు మేనేజర్ కూడా ఒకే చెప్పాడు. దీంతో రైతు ఆనందంతో మురిసిపోయాడు. కానీ ఆ తర్వాత మేనేజర్ పాడు బుద్ధి బయటపడింది. రుణం ఇస్తానంటూ.. ఊరులోంచి నాటు కోళ్లు తీసుకు రమ్మని చెప్పాడు. ఇలా ప్రతి శనివారం కోళ్లు తీసుకెళ్తూ ఉండేవాడు. పాపం లోన్ వస్తుందన్న ఆశతో రైతు కూడా పలుమార్లు కోళ్లు తీసుకెళ్తూ ఉండేవాడు. కానీ ఎన్ని రోజులైనా రుణం మాత్రం రాలేదు. రుణం పొందేందుకు ఉన్న కోళ్లు అమ్మి మేనేజర్‌కు 10 శాతం కమీషన్ కూడా ఇచ్చాడు. తీరా చూస్తే.. రుణం కూడా మంజూరు చేయలేదు. ఇక లోన్ రాదని నిర్ణయానికి వచ్చిన తర్వాత అన్నదాతకు చిర్రెత్తింది. మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలంటూ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయానికి వెళ్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. నాటు కోళ్ల కోసం రూ.39,000 ఖర్చు చేసినట్లు బిల్లులు కూడా చూపించాడు. తన డబ్బు తిరిగి ఇచ్చేలా.. న్యాయం చేయాలని కోరాడు. డబ్బులు ఇవ్వకపోతే బ్యాంకు ముందు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. రైతు ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
ఇది కూడా చదవండి: Manchu Family: మంచు ఫ్యామిలీ ‘డ్రామా’.. మనోజ్ ఫిర్యాదులో ట్విస్ట్!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!