ఇండియూ కూటమిలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్దిరోజులుగా నాయకత్వ మార్పుపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఇండియా కూటమి నాయకురాలిగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నియమించాలంటూ కూటమిలోని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి
ఢిల్లీలో ప్రధాని మోడీని కపూర్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మోడీ ఉల్లాసంగా గడిపారు. ఒక్కొక్కరిని పలకరించి విశేషాలు తెలుసుకున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన శరద్ పవార్ పార్టీకి మరో షాక్ తగిలేటట్టు కనిపిస్తోంది. శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీలు.. మహాయుతి కూటమిలోకి వెళ్లేపోయే సూచనలు కనిపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ వ్యవహారశైలి కారణంగానే సభలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. ఇండియా కూటమి నేతలతో కలిసి ఖర్గే మీడియాతో మాట్లాడారు.
సిరియా ప్రభుత్వం పతనంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ కుట్రతోనే సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిపోయిందని ఖమేనీ ఆరోపించారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తొలిసారి కోర్టు బోనెక్కారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి ఇజ్రాయెల్ ప్రధానిగా నిలిచారు. అవినీతి విచారణ కేసులో భాగంగా న్యాయస్థానం మెట్లెక్కారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని వైపులా శత్రువులు చుట్టుముట్టినప్పటికీ జ్ఞానం, సైన్స్ ఉపయోగించి ఇజ్రాయెల్ ఎలా బలమైన దేశంగా మారింది.. దాని చరిత్ర గురించి మనం నేర్చుకోవాలని తెలిపారు.