దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో బాధితురాలి తరపు న్యాయవాది బృందా గ్రోవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాధితురాలి తరపున వాదిస్తున్న కేసుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
సిరియాపై ఇజ్రాయెల్ యుద్ధం సాగిస్తోంది. సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిపోయింది. తిరుగుబాటుదారులు సిరియాను స్వాధీనం చేసుకున్నారు. అసద్ పారిపోయి రష్యాలో తలదాచుకుంటున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. అనంతరం స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ సంకేతాలు కారణంగా సూచీల్లో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి.
భారత్‌ను ఇప్పటికే చలి గాలులు హడలెత్తిస్తున్నాయి. ఇప్పుడు దీనికి వర్షాలు కూడా తోడయ్యాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది.
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. దీంతో కొద్దిరోజులుగా దాడులు తగ్గాయి. లెబనాన్ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్లిపోయాయి.
అమెరికాలో విమాన ప్రమాదం జరిగింది. టెక్సాస్‌లోని విక్టోరియా హైవేపై విమానం కూలిపోయింది. పలు కార్లను ఢీకొట్టి ముక్కలైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. మొదటిసారిగా 5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 14 సంవత్సరాల్లో ఇదే తొలిసారి అని ఐఎండీ పేర్కొంది.
న్యూఇయర్ సందర్భంగా జియో కస్టమర్లకు జియో గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సరం కానుకగా జియో కొత్త రీచార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. న్యూ ఇయర్ వెలకమ్ ఆఫర్ ప్లాన్ 2025ని కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.
ఢిల్లీలో ప్రధాని మోడీని కపూర్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అంతేకాకుండా ఒక్కొక్కరితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.