అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని వైపులా శత్రువులు చుట్టుముట్టినప్పటికీ జ్ఞానం, సైన్స్ ఉపయోగించి ఇజ్రాయెల్ ఎలా బలమైన దేశంగా మారింది.. దాని చరిత్ర గురించి మనం నేర్చుకోవాలని తెలిపారు. అప్పుడే మనం సమాజంగా మనుగడ సాగించగలం అని చెప్పారు. అస్సాంలోని జముగురిహాట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. అస్సాం సరిహద్దులు ఎప్పుడూ సురక్షితంగా లేవని, రాష్ట్రంలో అనేక జిల్లాల్లో అస్సామీలు మైనారిటీలుగా ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
“ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాలని నేను అస్సామీలను కోరుతున్నాను. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ దేశం చుట్టూ ముస్లిం ఛాందసవాదులు ఉన్నారు. ఇరాన్, ఇరాక్‌లు పొరుగున ఉన్నందున తక్కువ జనాభా ఉన్న ఇజ్రాయెల్ సైన్స్, టెక్నాలజీ, శ్రమను ఉపయోగించి అజేయమైన దేశంగా మారింది.” అని సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. అస్సాం ఒప్పందం జరిగి నలభై ఏళ్లు గడుస్తున్నా.. బయటి శక్తుల ముప్పు తొలగిపోలేదని పేర్కొన్నారు. నిత్యం జనాభాలో మార్పు జరుగుతోందని, స్థానిక ఆదివాసీలు తమ హక్కులను కోల్పోతున్నారని అన్నారు.
ఇది కూడా చదవండి: KTR: ఆమె కాంగ్రెస్ తల్లి.. తెలంగాణ తల్లి కాదు..
ఇటీవల హమాస్, హిజ్బుల్లా లక్ష్యంగా గాజా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. వాళ్లకు వత్తాసు పలికిన ఇరాన్‌పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. భీకరమైన దాడులు చేసి ధ్వంసం చేసింది. అంతేకాకుండా ఆయా నేతల లీడర్లను కూడా ఐడీఎఫ్ దళాలు అంతమొందించాయి. తాజాగా ఇజ్రాయెల్ శక్తి సామర్థ్యాన్ని అస్సాం సీఎం మెచ్చుకున్నారు. ఇజ్రాయెల్ నుంచి అస్సామీలు నేర్చుకోవల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Winter: చలికాలంలో గర్భిణీలు ఎలాంటి ఆహారం తినాలంటే..!