బీజేపీ హైకమాండ్ ఎంపీలకు విప్ జారీ చేసింది. మంగళవారం ఎంపీలంతా లోక్‌సభకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 17, 2024న కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సభలో చర్చకు రానున్నందున పార్లమెంట్ సభ్యులంతా తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది.
జమిలి.. ఇప్పుడు దేశమంతా మార్మోగుతున్న పేరు. ఏ నాయకుడి నోట విన్నా.. ఏ రచ్చ బండ దగ్గర కూర్చున్నా.. ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఇంతగా జమిలి పేరు మార్మోగడానికి కారణం. మోడీ ప్రభుత్వం.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సరికొత్త రాజకీయ ఆలోచనకి పునాది.
పశ్చిమాసియాలో ఇంకా యుద్ధం కొనసాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా జరిగిన దాడిలో 69 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
సిరియా అధ్యక్షుడు అసద్ భవిష్యత్‌ను ముందే ఊహించినట్లుగా తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చక్కబెట్టుకున్నట్లు సమాచారం. తాజాగా అతడి అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
లొంగిపోయిన మావోయిస్టులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వరాల జల్లు కురిపించారు. బస్తర్‌లో లొంగిపోయిన మావోయిస్టులకు 15,000 ఇళ్లు కట్టిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
పాలస్తీనాకు కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ పార్లమెంట్ వేదికగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాలస్తీనా అని ముద్రించిన బ్యాగ్‌తో పార్లమెంట్ హాల్లో హల్చల్ చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హస్తిన పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి పచ్చని అడవి రక్తసిక్తమైంది. తుపాకీ శబ్ధాలతో దద్దరిల్లింది. భద్రతా దళాలకు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు హతమైనట్లుగా తెలుస్తోంది.
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా.. రాజకీయ పరిస్థితుల మాత్రం ఇంకా సద్దుమణగలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 12 రోజులకు ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి వరకు ముఖ్యమంత్రి పదవిపై మహాయుతి కూటమిలో తీవ్ర పంచాయితీ జరిగింది.