ముంబై తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బోటులో విహరిస్తూ ఆహ్లాదకరంగా గడుపుతున్న పర్యాటకులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓ స్పీడుబోటు అమాంతంగా వచ్చి ఢీకొట్టడంతో ఫెర్రీ బోటు బోల్తా పడింది.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి.
అతి వినయం ధూర్త లక్షణం అంటారు పెద్దలు. అంటే అవసరమైన దానికన్నా అధికంగా వినయం చూపేవారి గురించి పెద్దలు ఈ సామెత ఉపయోగిస్తుంటారు. అంతేకాదు.. అతి వినయం దుష్టుల లక్షణం అని కూడా అంటారు.
కొత్త సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. త్వరలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనుంది.
భారతదేశ రాజకీయ చరిత్రలో మంగళవారం చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
బీహార్‌లో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్ని్కలు జరగనున్నాయి. దీంతో ఈ ఏడాది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీని స్థాపించారు. ‘జన సూరజ్’ పేరుతో పార్టీ స్థాపించారు.
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్ర నేత ఎల్కే. అద్వానీ (97) ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని.. ఒకటి లేదా రెండు రోజుల్లో ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకు తరలించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.