బీహార్‌లో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్ని్కలు జరగనున్నాయి. దీంతో ఈ ఏడాది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీని స్థాపించారు. ‘జన సూరజ్’ పేరుతో పార్టీ స్థాపించారు. బీహార్ ఎన్నికల్లో పోటీకి సమాయత్తం అవుతున్నారు. పార్టీ స్థాపించి ఎన్నో రోజులు కాకముందే జన సూరజ్ పార్టీలో తిరుగుబాటు మొదలైంది. ఆ పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఇద్దరు రాజీనామా చేశారు. మాజీ ఎంపీలైన దేవేంద్ర ప్రసాద్ యాదవ్, మునాజీర్ హసన్ పార్టీని వీడారు. ఇద్దరూ ప్రశాంత్ కిషోర్ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ చేసే పనులు ఏమీ నచ్చటం లేదని, ఆయన ఒంటెద్దుపోకడలకు పోతున్నారని, ఎవరు ఏం చెప్పినా వినటం లేదని ఆరోపిస్తూ కోర్ కమిటీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.
ఇది కూడా చదవండి: India W vs West Indies W: రెండో టీ20లో భారత్పై వెస్టిండీస్ గెలుపు..
అక్టోబర్ 2, 2024న ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ అనే రాజకీయ పార్టీని ప్రకటించారు. బీహార్ వెనుకబాటుతనానికి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయవేత్తలే కారణమేనని, తాను ఒక ప్రత్యామ్నయంగా బీహార్ను అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు. పార్టీ సింబల్లో మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫొటోలను పొందుపరిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి బీహార్ లో పెను తుఫాను సృష్టిస్తానని వెల్లడించారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లడంతో కోర్ కమిటీ సభ్యులే రాజీనామా చేసి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: LK Advani: ఎల్‌కే. అద్వానీ హెల్త్ అప్‌డేట్ విడుదల!