Maharashtra: నిన్న ఫడ్నవిస్‌తో ఉద్ధవ్ థాక్రే.. నేడు ప్రధానితో శరద్ పవార్ భేటీ.. ఎంవీఏలో ఏం జరుగుతోంది!?
- నిన్న ఫడ్నవిస్‌తో ఉద్ధవ్ థాక్రే భేటీ
- నేడు ప్రధానితో శరద్ పవార్ భేటీ
- ఎంవీఏలో ఏం జరుగుతోంది!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయం పాలైంది. మహాయుతి (బీజేపీ, శివసేన, ఎన్సీపీ) కూటమి మాత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి పీఠం బీజేపీకి దక్కింది. దేవేంద్ర ఫడ్నవిస్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలు అయ్యారు.
ఇదిలా ఉంటే మహా వికాస్ అఘాడీ కూటమి పరాజయం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష కూటమి నేతలు.. అధికార పార్టీ వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. అడుగులు మెల్లమెల్లగా మహాయుతి వైపు పడుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళవారం అనూహ్యంగా ఉద్ధవ్ థాక్రే తన కుమారుడు ఆదిత్య థాక్రేతో కలిసి ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ను కలిశారు. భేటీ అనంతరం ఆదిత్య థాక్రే మాట్లాడుతూ… మహారాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేసేందుకు ఇదొక ముందడుగు అని తెలిపారు. ఏ కూటమిలో ఉన్నా.. ప్రజాప్రతినిధులుగా.. అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
మరోవైపు ఫడ్నవిస్‌తో ఉద్ధవ్ థాక్రే కలిసి కొన్ని గంటలైనా గడవక ముందే.. రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. మహారాష్ట్ర రైతులతో కలిసి ప్రధానిని కలిశారు. అయితే భేటీ ఉద్దేశాలు వేరైనా.. ప్రతిపక్ష నేతల వరుస భేటీలు మాత్రం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహా వికాస్ అఘాడీ నేతలు.. అధికార పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం కేంద్రం.. ఎంతో ప్రతిష్టాత్మకమైన జమిలి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందేందుకు ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్ పార్టీ ఎంపీలను కలుపుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత కూడా ఈ విధమైన సంకేతం ఇచ్చారు. త్వరలో శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీలు.. బీజేపీలో చేరొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధాని మోడీతో శరద్ పవార్ భేటీ ఎలాంటి రాజకీయ మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.
Rajya Sabha MP and former Union Minister Sharad Pawar, along with a group of farmers, met PM Narendra Modi today: PMO
(Pics: PMO/X) pic.twitter.com/SkSb1kSqmy
— ANI (@ANI) December 18, 2024
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!