Amit Shah: అంబేద్కర్‌ను గౌరవించింది మోడీ సర్కారే
- అంబేద్కర్‌ను గౌరవించింది మోడీ సర్కారే
- కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్లారిటీ
- తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. అంబేద్కర్‌ను బీజేపీని అవమానపరుస్తోందని నినాదాలు చేశారు.
రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా అమిత్ షా ప్రసంగించారు. అంబేద్కర్ పేరు పెట్టుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిందంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అంటూ చెప్పుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయిందని.. ఇన్ని సార్లు దేవుడి పేరు తలుచుకున్నా.. స్వర్గంలో చోటు దక్కేదని అమిత్ షా అన్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. బీజేపీ.. అంబేద్కర్‌ను అవమానిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం చెలరేగడంతో బుధవారం అమిత్ షా మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అంబేద్కర్‌ను బీజేపీ ఎప్పుడూ అగౌరవపరచలేదన్నారు. మోడీ సర్కారే అంబేద్కర్‌ను గౌరవించిందని తెలిపారు. దళితుల రిజర్వేషన్లను మరింత బలోపేతం చేసింది బీజేపీనే అని చెప్పుకొచ్చారు. ఆ మాటికి వస్తే.. కాంగ్రెస్సే అంబేద్కర్‌ను అగౌరవపరిచిందని పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ హయాంలోనే దళితులపై దాడులు జరిగాయని వివరించారు. అంబేద్కర్‌ను పలుమార్లు అవమానించిందని.. రిజర్వేషన్లను కూడా కాంగ్రెస్ వ్యతిరేకించిందని ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని ధ్వజమెత్తారు. ఎమర్జెన్సీ విధించడం ద్వారా కాంగ్రెస్ రాజ్యాంగంలోని అన్ని విలువలను, ప్రజాస్వామ్య హక్కులను తుంగలో తొక్కిందని అమిత్ షా మండిపడ్డారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!