Priyanka Gandhi: ప్రియాంకకు 1984తో కూడిన బ్యాగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన బీజేపీ.. తీసుకుని ఏం చేశారంటే..!
- ప్రియాంకకు 1984తో కూడిన బ్యాగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన బీజేపీ
- తీసుకుని పక్కన పడేసిన వయనాడ్ ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీకి పార్లమెంట్ ఆవరణలో అనూహ్యమైన పరిణామం ఎదురైంది. ఓ బీజేపీ మహిళా ఎంపీ ఇచ్చిన బ్యాగ్‌తో అవాక్కయ్యారు. ప్రియాంకా గాంధీకి ‘1984’ బ్యాగ్‌ను బహుమతిగా బీజేపీ ఎంపీ అపరాజితా షడంగి అందజేశారు.
ఇది కూడా చదవండి: Pushpa 2: వందేళ్ల హిందీ సినిమా చరిత్రను తిరగరాసిన అల్లు అర్జున్
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
ప్రియాంక గాంధీ ఈ వారంలో రెండు సార్లు.. రెండు దేశాలకు సంబంధించిన బ్యాగ్‌లు ధరించి పార్లమెంట్ ఆవరణలో ప్రత్యక్షమయ్యారు. ఒకటి పాలస్తీనాకు మద్దతు తెలిపిన బ్యాగ్‌తో కనిపించారు. రెండో రోజు బంగ్లాదేశ్‌కు చెందిన బ్యాగ్‌తో హల్‌చల్ చేశారు. ఒకసారి మాత్రం అదానీ-మోడీ కలిసి ఉన్న బ్యాగ్ ధరించారు. ఇలా బ్యాగ్‌లతో ఆయా సందేశాలు అందజేశారు. అయితే శుక్రవారం మాత్రం.. బీజేపీ మహిళా ఎంపీ మాత్రం.. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన సిక్కుల ఊచకోతను గుర్తు చేసే బ్యాగ్‌ను అందజేశారు. అయితే ప్రియాంక మాత్రం.. ఆ బ్యాగ్‌ను తీసుకుని కొద్దిసేపటికే పక్కన పడేసి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్యాగ్‌పై ‘1984’ అని ఎరుపు రంగుతో రాసి ఉండడం విశేషం.
ఇది కూడా చదవండి: Divorce Case: “బిడ్డకు పేరు పెట్టే విషయంలో గొడవ”.. పిల్లాడికి కోర్టు ఏం పేరు పెట్టిందో తెలుసా..
ఎంపీ అపరాజితా షడంగి సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేసి పలు కామెంట్లు చేశారు. ‘‘కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకకు బ్యాగులంటే చాలా ఇష్టం. అందుకే ఆమెకు ‘1984’ నాటి సిక్కుల ఊచకోతకు సంబంధించిన బ్యాగు అందజేశాను. తొలుత దాన్ని తీసుకోవడానికి ఆమె నిరాకరించినా.. తర్వాత తీసుకొని పక్కన పెట్టేశారు’’ అని రాసుకొచ్చారు. గత 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందో నేటితరానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ బ్యాగును బహూకరించానని ఆమె పేర్కొన్నారు.
#WATCH | Delhi | BJP MP Aparajita Sarangi gave a bag with ‘1984’ purportedly written on it to Congress MP Priyanka Gandhi Vadra
(Source: BJP) pic.twitter.com/oiudvpMCce
— ANI (@ANI) December 20, 2024
भाजपा सांसद की गांधीगिरी!
भाजपा सांसद अपराजिता सारंगी ने प्रियंका गाँधी को दिया 1984 लिखा बैग.1984 इंदिरा गाँधी की हत्या के बाद में सिखों के कत्लेआम का साल था.
संसद में बैग लेकर चर्चा में रहीं है प्रियंका, अब भाजपा सांसद ने उन्हें उन्हीं की भाषा में घेरा है.@AprajitaSarangi pic.twitter.com/Ds8M3PEaif
— The Frustrated Indian (@FrustIndian) December 20, 2024
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!