దేశ రాజధాని ఢిల్లీలో అనుమానిత బ్యాగ్ తీవ్ర కలకలం రేపింది. బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర అనుమానిత బ్యాగ్ ప్రత్యక్షమైంది. దీంతో బీజేపీ శ్రేణులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు కార్యాలయం వెలుపల క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కనుగొన్న బ్యాగుపై పోలీసు స్టిక్కర్ ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. ప్రజలు ప్రశాంతంగా ఉండొచ్చని అధికారి పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా ఆఫీస్ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. బ్యాగ్ మూలాలను గుర్తిస్తున్నామని.. ముప్పును తోసిపుచ్చలేమన్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan Warning: అభిమానులకు పవన్ కల్యాణ్ స్వీట్ వార్నింగ్.. నన్ను పనిచేసుకోనివ్వండి..!
శుక్రవారం ఢిల్లీ బీజేపీ కార్యాలయం దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ వెలుపల అనుమానిత బ్యాగ్ ఉండడం పార్టీ శ్రేణులు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో భద్రతా సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దర్యాప్తు కోసం బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అయితే బ్యాగ్‌పై పోలీసు స్టిక్కర్ ఉండడం గమనార్హం. ఎవరైనా మరిచిపోయారా? లేదంటే కావాలనే వదిలేశారా? అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముందు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ప్రజలు మాత్రం ఎలాంటి భయాందోళన చెందొద్దని పోలీసులు హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: 35Movie : 35 చిన్న కథ కాదు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఎప్పుడంటే..?
#WATCH | Delhi: An unattended bag was found near the Delhi BJP office today. The area was cordoned off and the bag was confiscated by police.
Details awaited. pic.twitter.com/1q712tR8Vc
— ANI (@ANI) December 20, 2024