ముంబై ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవంలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. అతిరథ మహారథులంతా ఈ కార్యక్రమానికి హాజరై నూతనోత్సాహం తీసుకొచ్చారు. ఇక ఈ కార్యక్రమానికి ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కలిసి హాజరు కావడం ట్రెండింగ్‌గా మారింది. దంపతులిద్దరూ నవ్వుతూ.. ఉల్లాసంగా కనిపించారు. కుమార్తె ఆరాధ్య ఇదే స్కూల్లో విద్యాభాస్యం చేస్తోంది. దీంతో ఆరాద్య తాత.. అమితాబ్ బచ్చన్.. తల్లిదండ్రులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్ హాజరు కావడం కొత్త కళ తీసుకొచ్చింది. ఈ ముగ్గురు కలిసే కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఐశ్వర్య-అభిషేక్ విడిపోయారంటూ ఎప్పటి నుంచో రూమర్స్ నడుస్తున్నాయి. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లికి కూడా విడివిడిగానే దంపతులిద్దరూ హాజరయ్యారు. దీంతో వదంతులకు బలం చేకూరింది. దీంతో సోషల్ మీడియాలో రకరకాలైన కథనాలు పుట్టుకొచ్చాయి. కానీ.. తాజా దృశ్యాలతో అవన్నీ పుకార్లేనని తేలిపోయాయి.
ఇక ఐశ్వర్య దంపతులతో పాటు బాలీవుడ్ స్టార్లు షారూఖ్‌ఖాన్, గౌరీ ఖాన్ దంపతులు, కుమార్తె సుహానా ఖాన్ కూడా ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, తదితర తారలంతా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. కరీనా కుమారులు తైమూర్, జెహ్ కూడా అంబానీ స్కూల్‌లోనే చదువుతున్నారు. ఇక వార్షికోత్సవం సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
King @iamsrk with his family. He is looking so handsome. pic.twitter.com/ZHE8RvBnk8
— Asma (@asmasun01) December 19, 2024