కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోనియా చికిత్స పొందుతున్నారు. తల్లి సోనియా వెంట ప్రియాంకాగాంధీ ఉన్నారు.
కర్ణాటకలో రహదారుల పేర్ల వ్యవహారం దుమారం రేపుతోంది. మైసూరులోని ఒక రోడ్డుకు సిద్ధరామయ్య పేరు పెట్టాలని మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన చేసింది. ఇందుకు ప్రజల నుంచి 30 రోజుల్లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది.
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ-సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా హసన్ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నెట్టింట వార్తలు వైరల్ కావడంతో సమాజ్‌వాదీ ఎంపీ ఇక్రా హసన్ స్పందించారు.
ముంబైలో ఫెర్రీ బోటు ప్రమాదం మరువక ముందే గోవాలో మరో ప్రమాదం జరిగింది. గోవాలోని కలాంగుట్ బీచ్‌లో టూరిస్ట్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 20 మందిని రక్షించారు.
చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ మధ్య చిన్నా..పెద్ద తేడా లేకుండా కళ్ల ముందే కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరుచుగా జరుగుతున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త రెవెన్యూ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణిష్ చావ్లా నియమితులయ్యారు. చావ్లా ప్రస్తుతం రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖలో ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ఒక పొరపాటు అని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ వ్యాఖ్యానించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నారు. ఈ తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు.
ఓ బాలిక ప్రైవేట్ ఫొటోలు కొందరి చేతుల్లోకి వెళ్లాయి. ఇంకేముంది వారికి అస్త్రంగా మారింది. అసభ్యకరమైన ఫొటోలను అడ్డంపెట్టుకుని బెదిరింపులకు గురి చేశారు. దీంతో కంగారు పడిపోయిన బాలిక.. డబ్బు డిమాండ్ చేసినప్పుడల్లా సమర్పించుకుంటూ వచ్చింది.
స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకకు వెళ్లడమే శాపమైంది. బర్త్‌డే వేడుకలో జరిగిన అవమానం.. హేళన మానసికంగా కృంగదీసింది. దీంతో ముక్కుపచ్చలారని ఓ బాలుడు అర్థాంతరంగా తనువు చాలించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.