భారతీయ-బ్రిటిష్ ఆంగ్ల రచయిత సల్మాన్ రష్దీకి చెందిన వివాదాస్పద నవల ‘ది సైటానిక్ వెర్సెస్’ పుస్తకాలు దాదాపు 36 ఏళ్ల నిషేధం తర్వాత దేశ రాజధాని ఢిల్లీలోని బహ్రిసన్స్ బుక్స్టాల్లో ప్రత్యక్షమయ్యాయి.
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ భార్య అస్మా యూకేకి తిరిగి రాలేదని బ్రిటన్ ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. బ్రిటిష్-సిరియా జాతీయురాలైన అస్మా.. భర్త అసద్ పాలనలోని యుద్ధ నేరాల్లో ఆమె పాత్ర కారణంగా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ప్రయాణ నిషేధాలు, ఆస్తుల జప్తులు అమల్లో ఉన్నాయి.
రష్యా మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 2025 కొత్త సంవత్సరంలో వాట్సాప్‌పై నిషేధం విధించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సంకేతాలు వెలువడ్డాయి. విదేశీ యాప్‌లు రష్యన్ చట్టాలకు లోబడి ఉండకపోతే నిషేధం విధిస్తామని రష్యన్ అధికారులు తెలిపారు.
బీహార్ విద్యాశాఖలో వింతైన సంఘటన వెలుగు చూసింది. ఒక మగ ఉపాధ్యాయుడికి మెటర్నిటీ లీవ్ మంజూరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
జమ్మూకాశ్మీర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. 300 అడుగుల లోయలో ఆర్మీ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న జమ్మూకాశ్మీర్ పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
సిరియాలో కారు బాంబు దాడి బీభత్సం సృష్టించింది. ఉత్తర సిరియాలోని టర్కీ మద్దతుగల సిరియన్ నేషనల్ ఆర్మీ నియంత్రణలో ఉన్న మన్బిజ్ నగరంలో కారు బాంబు దాడి జరిగింది.
క్రిస్మస్ వేళ ప్రపంచంలోనే అతిపెద్ద అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రయాణికులతో ఎయిర్‌పోర్టులు సందడి.. సందడిగా కిటకిటలాడుతున్న సమయంలో ప్రయాణికులకు షాకిచ్చింది.
అంబేద్కర్‌పై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత వారం నుంచి దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి.
గుజరాత్లో రైలు ప్రమాదం జరిగింది. సూరత్ సమీపంలో దాదర్-పోర్బందర్ సౌరాష్ట్ర ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.