యూపీలో ఓ ప్రియురాలు ఘాతుకానికి పాల్పడింది. ప్రియుడి ప్రైవేటు పార్ట్‌ను కత్తిరించేసింది. దీంతో బాధితుడు విలవిలలాడిపోయాడు. ఈ ఘటన ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది.
బబ్లూ, హీనా ప్రేమికులు. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే బబ్లూ.. ప్రియురాలికి హ్యాండిచ్చి మీరట్‌లోని సివల్‌ఖాస్ గ్రామానికి చెందిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. 15 రోజులు క్రితం పెద్దలు బబ్లూకు ఎంగేజ్‌మెంట్ చేశారు. ఈ ఘటన ప్రియురాలికి తీవ్ర కోపం తెప్పించింది. అయితే హోటల్‌లో కలుసుకుందామంటూ బబ్లూకి హీనా కబురు పంపింది. అయితే హోటల్‌కు వచ్చాక.. నిశ్చితార్థం చేసుకోవడంపై హీనా గొడవ పడింది. అనంతరం ప్రియురాలి.. సన్నిహితంగా ఉన్నట్టుండి నటించింది. అంతే హఠాత్తుగా తన వెంట తెచ్చుకున్న చాకుతో ప్రైవేటుపై దాడి చేసి నరికేసింది. ఈ పరిణామంతో ప్రియుడు కూడా ఎదురుదాడి చేశాడు. అయితే ప్రైవేటు పార్ట్‌పై దాడి చేయడంతో విలవిలలాడిపోయాడు. హోటల్ సిబ్బంది.. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: One Nation-One Election: “ఒకే దేశం ఒకే ఎన్నిక”పై జేపీసీ తొలి సమావేశం తేదీ విడుదల..
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఇద్దరూ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. యువకుడు.. పెళ్లిని వేరే యువతితో నిశ్చయించుకున్నాడని, ఇది తనకు తీవ్ర ఆగ్రహం తెప్పించిందని మహిళ చెప్పినట్లు తెలిపారు. హోటల్‌లో కలుసుకుందామని పిలిచి పదునైన వస్తువుతో దాడి చేసినట్లు వెల్లడించారు. ఇరువురు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గాయపడిన వ్యక్తిని తదుపరి చికిత్స కోసం మీరట్‌కు రిఫర్ చేశారు.
ఇది కూడా చదవండి: Tragedy: ఇటుక బట్టీ గోడ కూలి నిద్రిస్తున్న నలుగురు చిన్నారులు మృతి..