karnataka: స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా విద్యుత్ షాక్.. తల్లి, కొడుకుకు తీవ్రగాయాలు
- కర్ణాటకలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం
- స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా విద్యుత్ షాక్
- తల్లి, కొడుకుకు తీవ్రగాయాలు.. ఆస్పత్రిలో చికిత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా తల్లి, కుమారుడు తీవ్రగాయాలతో కొట్టిమిట్టాడుతున్నారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని కలబురగిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కలబురగి మోహన్ లాడ్జి సమీపంలో స్కూల్ బస్సు కోసం ఓ తల్లి.. కొడుకుతో నిరీక్షిస్తోంది. ఇంతలో బస్సు రానే వచ్చింది. స్కూల్ బస్సు ఆగిన చోటే విద్యుత్ వైర్ తెగిపడి ఉంది. ఇది గమనించకపోవడంతో మహిళ విద్యుత్ వైర్‌పై కాలు వేసింది. వెంటనే మంటలు అంటుకున్నాయి. తల్లికి ఏదో అయిందని పట్టుకోబోగా చిన్నారికి కూడా గాయాలయ్యాయి. సమీపంలో ఉన్న వారంతా సాయం చేసేందుకు ప్రయత్నించినా మంటలు చెలరేగడంతో భయపడ్డారు. మొత్తానికి చాకచక్యంగా ప్రమాదం నుంచి తప్పించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, కొడుకు చికిత్స పొందుతున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంటలు అంటుకున్న సమయంలో స్కూల్ బస్సులో 11 మంది చిన్నారులు ఉన్నారు. అయితే డ్రైవర్ బస్సును కొంచెం ముందుకు పోనివ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు వాపోయారు. పిల్లలంతా క్షేమంగా ఉండడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా గాయపడిన బాలుడు వికలాంగుడు కావడం విశేషం.
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాప్ సమీపంలో విద్యుత్ వైరు వేలాడుతూ ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించారు. బస్సు లోపలికి వెళ్లే సరికి కేబుల్ తగలడంతో భాగ్యశ్రీకి కరెంట్ షాక్ తగిలిందని చెప్పారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విద్యుత్తు శాఖపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Negligence Strikes Again: Kalaburagi Woman Critically Injured
1. Tragic Accident: A live wire fell on a school bus for children with intellectual disabilities near Mohan Lodge.
2. Woman Severely Burned: Bhagyashree suffered critical injuries while helping her child board the… pic.twitter.com/EHdNmbnLZu
— Sneha Mordani (@snehamordani) December 24, 2024
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!