ఢిల్లీ పేలుడుపై దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో తాజాగా అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. పేలుడుకు ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడెక్కడ తిరిగాడో ఆ సీసీటీవీ ఫుటేజ్లను అధికారులు సేకరించారు. ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఉమర్ రెండు సెల్ఫోన్లు ఉపయోగించినట్లుగా గుర్తించారు.
బంగారం ప్రియులకు శుభవార్త. గత కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులకు గురవుతున్న పసిడి ధరలు సోమవారం దిగొచ్చాయి. గత వారం భారీగా తగ్గిన ధరలు.. ఈవారం ప్రారంభంలో కూడా స్వల్పంగా తగ్గింది. దీంతో గోల్డ్ లవర్స్ కొనుగోలు చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు.
బంగ్లాదేశ్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. సోమవారం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు సంబంధించిన కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) తీర్పు వెలువరించనుంది.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై గత కొద్దిరోజులుగా తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో మరోసారి ఇదే రకమైన చర్చ నడుస్తోంది. ప్రభుత్వ ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తైన సందర్భంగా సిద్ధరామయ్య మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేసేందుకు సిద్ధపడ్డారు.
పాలస్తీనా దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. గాజా శాంతి ఒప్పందానికి సంబంధించిన తీర్మానంపై సోమవారం ఐక్యరాజ్యసమితిలో అమెరికా ఓటు వేయనుంది. అమెరికాతో పాటు ఈజిప్ట్, ముస్లిం దేశాలు మద్దతుగా ఓటు వేయనున్నాయి.
ఆగ్నేయ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మైనింగ్ గనిలో వంతెన కూలి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా కూలిపోయింది. తప్పించుకునే ప్రయత్నం చేసినా వీలు లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. సర్వేల అంచనాలకు మించి సునామీ సృష్టించింది. తిరుగులేని శక్తిగా ఎన్డీఏ కూటమి చరిత్ర సృష్టించింది. ఈ విజయం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది. కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నాయి.
బీహార్ ఎన్నికలకు ముందు అంతన్నారు.. ఇంతన్నారు. తీరా ఫలితాలు వచ్చేటప్పటికీ బొక్కబొర్లా పడ్డారు. ఇదంతా ఎవరి గురించి అంటారా? అదేనండీ.. ఇండియా కూటమి గురించి. ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచి తమదే అధికారం అంటూ ప్రచారం చేసుకుంది.
దేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఆయా చోట్ల జరిగిన బైపోల్స్లో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు.