వామ్మో.. ఇవేమి ఫలితాలు. బీజేపీ నేతలు కూడా ఊహించని రీతిలో బీహార్ ఫలితాలు వెలువడుతున్నాయి. సర్వేల అంచనాలు కూడా తారుమారు అవుతూ ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 200 మార్కు దాటి 201 నాటౌట్ దిశగా దూసుకెళ్తోంది. బీజేపీ 90 శాతం స్ట్రైక్‌రేట్‌తో దూసుకెళ్తోంది. ఎవరూ ఊహించని రీతిలో బీహారీయులు అద్భుతమైన తీర్పును ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీకి 95వ ఓటమి’’.. అవార్డు ఇవ్వాలంటూ బీజేపీ ఎగతాళి..
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. నవంబర్ 6, 11 తేదీల్లో ఓటింగ్ జరిగింది. ఇక నవంబర్ 11న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీఏకు దాదాపుగా 140 నుంచి 160 స్థానాలు వస్తాయని అంచనాలు వేశాయి. తీరా ఎన్నికల ఫలితాలు నాటికి అంతా రివర్స్ అయింది. సర్వే అంచనాలకు మించి ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 201 దాటి వెళ్లిపోతుంది. విపక్ష కూటమి క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తోంది. ఆర్జేడీ కంచుకోటలో కూడా ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీచాయి. ఎక్కడా కూడా ఆర్జేడీ ప్రభావం చూపించలేదు. ఇక కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణం. హస్తం పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపించలేదు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: పని చేయని రాహుల్‌గాంధీ ‘ఓట్ చోర్’ పాచిక