DK Shivakumar: డీకే.శివకుమార్ రాజీనామా అంటూ పుకార్లు! కర్ణాటకలో ఏం జరుగుతోంది!
- డీకే.శివకుమార్ రాజీనామా అంటూ పుకార్లు!
- కర్ణాటకలో ఏం జరుగుతోంది!
- ఢిల్లీ టూర్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై గత కొద్దిరోజులుగా తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో మరోసారి ఇదే రకమైన చర్చ నడుస్తోంది. ప్రభుత్వ ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తైన సందర్భంగా సిద్ధరామయ్య మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేసేందుకు సిద్ధపడ్డారు. ప్రస్తుతం సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాహుల్‌గాంధీతో సమావేశమై కీలక చర్చలు జరిపారు.
ఇది కూడా చదవండి: Israel: పాలస్తీనా దేశాన్ని అంగీకరించబోం.. యూఎన్ తీర్మానానికి ముందు ఇజ్రాయెల్ ప్రకటన
Also Read
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ఈ నేపథ్యంలో డీకే.శివకుమార్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీమానా చేసినట్లు పుకార్లు నడుస్తున్నాయి. మీడియాలో వార్తలు హల్‌చల్ చేయడంతో తాజాగా ఇదే అంశంపై డీకే.శివకుమార్ స్పందించారు. తాను పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుడినని.. రాజీనామా వార్తలు పుకార్లుంటూ తోసిపుచ్చారు. ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేది పూర్తిగా సిద్ధరామయ్యదేనని.. పార్టీ హైకమాండ్‌తో చర్చించిన తర్వాతే ఇది జరుగుతోందని పేర్కొన్నారు. తాను ఢిల్లీ వెళ్లింది రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేను కర్ణాటకకు ఆహ్వానించడానికి వెళ్లినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 100 కాంగ్రెస్ కార్యాలయాల శంకుస్థాపన చేయబోతున్నామని.. దీనికి ఆహ్వానించేందుకు మాత్రమే ఢిల్లీ వెళ్లినట్లుగా క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Congo Video: కాంగోలో కూలిన మైనింగ్ గని వంతెన.. 32 మంది మృతి
‘‘శంకుస్థాపన కార్యక్రమాలు.. ఇతర కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఎవరు నిర్వహిస్తారు? నేనే చేయాలి. నేను (రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి) రాజీనామా చేస్తానని ఎందుకు చెబుతారు? ఆ పరిస్థితి ఇంకా తలెత్తలేదు.’’ అని శివకుమార్ ఢిల్లీలో విలేకరులతో అన్నారు. రాజీనామా ఊహాగానాలన్నీ మీడియా సృష్టేనని తెలిపారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు తాను చేయబోనని స్పష్టం చేశారు. పార్టీ కోసం రాత్రింబవళ్లు అవిశ్రాంతంగా పనిచేశానని… భవిష్యత్తులో కూడా ఇలానే చేస్తానని వెల్లడించారు. 2028లో కర్ణాటకలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే తన కర్తవ్యం అని వెల్లడించారు.
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలిశారు. ఈ సందర్భంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, అనేక అంశాలపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి భేటీ తర్వాతే డీకే.శివకుమార్ రాజీనామా చేస్తున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి డీకే.శివకుమార్ క్లారిటీ ఇచ్చేశారు.
Delhi | On meeting with Congress national president Mallikarjun Kharge, Karnataka Deputy CM DK Shivakumar says, "It's natural for the state president and the national president to meet. There's nothing special about it. There were some party-related matters along with the office… pic.twitter.com/dLFBKxQbUe
— ANI (@ANI) November 17, 2025
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్‌లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?