బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ మహిళా నేత, అహ్మద్ పటేల్ కుమార్తె ముంతాజ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. బీహార్ ఎన్నికల్లో పార్టీ పని తీరును తీవ్రంగా తప్పుబడుతూ విమర్శలు చేశారు.
ఢిల్లీ బాంబ్ పేలుడుపై దర్యాప్తు కొనసాగుతోంది. తవ్వేకొద్దీ కుట్ర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. తాజాగా ఉగ్రవాదులకు సంబంధించిన మరో కారును అధికారులు గుర్తించారు. ఉగ్ర కుట్రలో భాగంగా 5వ వాహనం అద్దెకు తీసుకున్నట్లుగా కనిపెట్టారు. హ్యుందాయ్ i10 కారును అద్దెకు తీసుకున్నారు.
అగ్ర రాజ్యం అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేసే బిల్లుకు అమెరికా చట్టసభ సభ్యులు ఆమోదించారు. 427-1 తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ట్రంప్‌కు తీవ్రమైన మద్దతుదారుడు.. లూసియానా రిపబ్లికన్ ప్రతినిధి క్లే హిగ్గిన్స్ మాత్రమే ఓటు వేయలేదు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎన్నో ప్రగల్భాలు పలికారు. జేడీయూ 25 సీట్లు కంటే ఎక్కువ గెలవదని.. అసలు అధికార కూటమి ఘోరంగా ఓడిపోబోతుందని.. జేడీయూ 25 సీట్లు కంటే ఎక్కువ గెలిస్తే రాజీనామా చేస్తానని ఎన్నో ప్రెస్‌మీట్‌ల్లో చెప్పుకొచ్చారు.
ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా కీలక ఫొటోలు వెలుగులోకి వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా డాక్టర్ షాహీన్ భారీ కుట్రలకు ప్రణాళికలు రచించింది. ఉగ్రదాడులకు కర్త, కర్మ, క్రియ మొత్తం షాహీనే అని అధికారులు గుర్తించారు. తాజాగా సన్నిహిత డాక్టర్ ముజమ్మిల్‌తో కలిసి ఒక షోరూమ్‌లో కారు కొనుగోలు చేస్తున్న ఫొటో బయటకు వచ్చింది.
ఢిల్లీ కారు బ్లాస్ట్‌లో ఉగ్రవాది ఉమర్‌కు సహకరించిన.. క్రియాశీల సహ కుట్రదారుడు జాసిర్ బిలాల్ అలియాస్ డానిష్ ఫొటో వెలుగులోకి వచ్చింది. ఇతడే జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ల బ్రెయిన్ వాష్ చేశాడు. ఉగ్రవాదం వైపునకు మళ్లించాడు. ప్రస్తతం డానిష్‌కు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.
బీహార్ ప్రజల విశ్వాసాన్ని జన్ సురాజ్ పార్టీ గెలుచుకోలేకపోయిందని ఆ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట దగ్గర కారు బ్లాస్ట్ మరువక ముందే తాజాగా బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. స్కూళ్లు, కోర్టులకు బెదిరింపులు వచ్చాయి. పాటియాలా హౌస్, సాకేత్ కోర్టులతో పాటు రెండు సీఆర్పీఎఫ్ స్కూళ్లకు కూడా బాంబ్ బెదిరింపులు వచ్చాయి
బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్ నవంబర్ 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముచ్చటగా పదోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఇదిలా ఉంటే సోమవారం గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కలిసిన నితీష్ కుమార్.. ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేయాలని కోరారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొద్దిరోజులుగా కుర్చీ పంచాయితీ నడుస్తోంది. సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. గతంలో హైకమాండ్ ఫుల్స్టాప్ పెట్టినా.. తాజాగా మరోసారి రచ్చ రేపుతోంది.