ఢిల్లీ బ్లాస్ట్‌పై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా పేలుడు జరిగిన 300 మీటర్ల దూరంలోని ఒక షాపుపై ఒక వ్యక్తి శరీర భాగాలు స్వాధీనం చేసుకున్నారు. లజ్‌పత్‌రాయ్ మార్కెట్లోని ఒక దుకాణంపై తెగిపోయిన చేయిను రికవరీ చేసుకున్నారు.
ఢిల్లీ పేలుడు వెనుక ఉన్న కుట్ర వీడుతోంది. దర్యాప్తు సంస్థలు చాలా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా ఉగ్రవాది డాక్టర్ ఉమర్ కొనుగోలు చేసిన మూడు కార్ల దృశ్యాలు అల్-ఫలాహ్ యూనివర్సిటీ సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా ఢిల్లీ పేలుడు తర్వాత ఉగ్ర కుట్ర వెనుక ఉన్న మిస్టరీ అంతా బయటకొస్తోంది. ఇప్పటికే కీలక సమాచారాన్ని రాబట్టిన దర్యాప్తు సంస్థలు.. తవ్వేకొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరిన్ని విషయాలు బయటకొచ్చాయి.
రేపే బీహార్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాలు లెక్కింపు ఉండగా.. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఇక ఢిల్లీ పేలుడు నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర ఈవీఎంలకు గట్టి భద్రతా ఏర్పాటు చేశారు.
ఢిల్లీ పేలుడుపై దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్వేకొద్దీ ఉగ్ర కుట్ర కోణాలు బయటకు వస్తున్నాయి. ఉగ్రవాది ఉమర్‌కు సంబంధించిన విషయాల్లో అంతర్జాతీయంగా జరిగిన కుట్ర వెలుగులోకి వచ్చింది.
ఒక వివాహ రిసెప్షన్లో దుండగుడు రెచ్చిపోయాడు. వేదికపై వధూవరులు బంధువులతో ఫొటోలు దిగుతుండగా హఠాత్తుగా ఒక యువకుడు కత్తితో ఎటాక్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతిలో చోటుచేసుకుంది.
అమెరికాలో ఎట్టకేలకు సుదీర్ఘ షట్‌డౌన్ ముగిసింది. ఈ మేరకు 222-209 ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. షట్‌డౌన్‌ను ముగించే ప్రభుత్వ ఫండింగ్ బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి సంతకం చేశారు. దీంతో 43 రోజుల సుదీర్ఘ షట్డౌన్కు అధికారికంగా ముగింపు లభించింది.
చెట్టు మంచిదైతే దాని కాయ కూడా మంచిదని ఎంచాలని పెద్దలు అంటుంటారు. అసలు చెట్టే మంచిది కాదన్నప్పుడు కాయ ఎలా మంచిది అవుతుంది. కానే కాదు. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? ప్రస్తుతం ఢిల్లీ కారు బాంబ్ పేలుడు తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ‘‘అల్-ఫలాహ్ యూనివర్సిటీ’ పేరు.
ఢిల్లీ కారు బాంబ్ పేలుడు తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేలుడు తర్వాత దేశ వ్యాప్తంగా డాక్టర్ల బృందం ఎన్ని కుట్రలు చేశారో తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాది డాక్టర్ ఉమర్ భారీ దాడులకే ప్లాన్ చేశాడు. ఈనెలలోనే ప్రధాని మోడీ ప్రారంభించిన అతి పెద్ద దేవాలయంపై దాడి చేసేందుకు ప్రణాళిక రచించినట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఢిల్లీ బ్లాస్ట్‌కు సంబంధించిన మరొక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో స్పష్టంగా కారు పేలిన దృశ్యాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.